‘ఇది నా లవ్‌స్టోరి’ ట్రైలర్‌ విడుదల

నువ్వేకావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నవవసంతం, శశిరేఖా పరిణయం లాంటి చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ పెంచుకొని కొన్నాళ్లు ఇండస్ట్రీలో మంచి ఆహ్లాదకరమైన ప్రేమకథల్లో నటించిన నటుడు తరుణ్. 

Last Updated : Jan 8, 2018, 04:57 PM IST
‘ఇది నా లవ్‌స్టోరి’ ట్రైలర్‌ విడుదల

నువ్వేకావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నవవసంతం, శశిరేఖా పరిణయం లాంటి చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ పెంచుకొని కొన్నాళ్లు ఇండస్ట్రీలో మంచి ఆహ్లాదకరమైన ప్రేమకథల్లో నటించిన నటుడు తరుణ్. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి చిత్రాలకు కూడా ఆయన సైన్ చేయలేదు. ఇటీవలి కాలంలో మళ్లీ ‘ఇది నా లవ్‌స్టోరి’ అనే ప్రేమకథాచిత్రంలో నటించారు ఆయన. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజే విడుదల అయ్యింది. రమేశ్‌ గోపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై ప్రకాశ్‌ ఎస్వీ నిర్మించారు. అలాగే శ్రీనాథ్‌ విజయ్‌ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అదేవిధంగా ఓవియా హెలెన్‌ కథానాయికగా తెలుగుతెరకు పరిచయమవుతోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Trending News