సుమంత్ నెగటివ్ షేడ్స్‌లో వస్తోన్న 'ఇదం జగత్' విడుదల తేదీ ఖరారు

ఇటీవలే వైఎస్ జగన్ చేతుల మీదుగా విడుదలైన ఇదం జగత్ టీజర్ 

Last Updated : Sep 1, 2018, 03:23 PM IST
సుమంత్ నెగటివ్ షేడ్స్‌లో వస్తోన్న 'ఇదం జగత్' విడుదల తేదీ ఖరారు

హీరో సుమంత్ నటిస్తున్న ఇదం జగత్ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. విరాట్ ఫిలింస్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్స్‌పై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అనీల్ శ్రీ కంఠం డైరెక్ట్ చేస్తున్నాడు. సుమంత్ సరసన కేరళ కుట్టి అంజు కురియన్ జంటగా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను సెప్టెంబరు 28న విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొలిసారిగా సుమంత్‌ను నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్న సినిమా ఇది.

ఇటీవలే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇదం జగత్ టీజర్‌ విడుదల కాగా త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు తాజాగా యూనిట్ వర్గాలు తెలిపాయి.

Trending News