Nagashaurya Hospitalised: వారంలో పెళ్లనగా నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Nagashaurya Hospitalised: మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నాగశౌర్య ఇప్పుడు హాస్పిటల్ బెడ్ ఎక్కడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతానికి ఆయనని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 14, 2022, 04:10 PM IST
Nagashaurya Hospitalised: వారంలో పెళ్లనగా నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Hero Nagashaurya Hospitalised: హీరో నాగశౌర్య అనూష శెట్టి అని కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈనెల 20వ తేదీన బెంగళూరులోని ఒక స్టార్ హోటల్ లో వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వారి వివాహానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉండగా ఇప్పుడు అనూహ్యంగా నాగశౌర్య అస్వస్థతకు గురవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి ఆయనని గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి నాగశౌర్య కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అందులో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సినిమా యూనిట్ ఆయనకు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఏఐజీ హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాగశౌర్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెబుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అందుతున్న సమాచారం మేరకు ఆరు నెలలుగా సిక్స్ ప్యాక్ కోసం డైట్ లో ఉన్నారని, బలమైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ షూటింగ్ లో నాగ శౌర్య పడిపోయారని అంటున్నారు. మరికాసేపట్లో ఆసుపత్రి నుంచి నాగ శౌర్య డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

నాగశౌర్య చివరిగా కృష్ణ బృందావిహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతానికి ఆయన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాలో నటిస్తున్నారు. అది కాకుండా నారీ నారీ నడుమ మురారి, పోలీసు వారి హెచ్చరిక అనే మరో రెండు సినిమాల్లో కూడా ఆయన హీరోగా నటిస్తున్నారు. సరిగ్గా మరొక వారం రోజుల్లోనే ఆయన వివాహం జరగాల్సి ఉంది నవంబర్ 20న బెంగళూరులోని జెడబ్ల్యూ మారియట్ హోటల్లో ఆయన వివాహం జరగాల్సి ఉంది.

19వ తేదీ మెహేంది కూడా జరగాల్సి ఉండగా ఇప్పుడు నాగశౌర్య షూటింగ్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడిన అనూష శెట్టి అనే యువతని ప్రేమించారు. వీరిద్దరూ తమ ఇళ్లలో ఒప్పించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఇక ఈ విషయం కొద్ది రోజుల క్రితం బయటికి వచ్చింది. వీరిద్దరికి సంబంధించిన శుభలేఖ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నాకు శౌర్య ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.

Also Read: Samantha Naga Chaitanya : ఆ విషయంలో సమంత ముందు నిలబడని నాగ చైతన్య.. ఇది మామూలు రేంజ్ కాదు

Also Read: Anusha Shetty: ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్య అనూషకు రిలేషన్ ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News