Harish Shankar : హరీష్‌ శంకర్ అంటే మినిమమ్ ఉంటది.. మాస్ డైరెక్టర్ పంచ్

Harish Shankar Satires హరీష్‌ శంకర్ సోషల్ మీడియాలో ఎంత సందడిగా ఉంటాడో అందరికీ తెలిసిందే. హరీష్‌ శంకర్ ట్వీట్లు ఎంతగానో ట్రెండ్ అవుతుంటాయి. నెగెటివ్ కామెంట్లు చేసే వాళ్లని వెంటనే బ్లాక్ చేసేస్తుంటాడు హరీష్ శంకర్.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2023, 11:11 AM IST
  • నెట్టింట్లో హరీష్‌ శంకర్ కౌంటర్లు
  • ప్రెస్ మీట్‌లో సురేష్‌ కొండేటి
  • మీడియాకు హరీష్‌ శంకర్ సెటైర్లు
Harish Shankar : హరీష్‌ శంకర్ అంటే మినిమమ్ ఉంటది.. మాస్ డైరెక్టర్ పంచ్

Harish Shankar Satires ఈ మధ్య తెలుగు మీడియా ప్రెస్ మీట్‌లు ఎంతగా చర్చకు దారి తీస్తున్నాయో అందరికీ తెలిసిందే. అందులోనూ కొంతమంది మీడియా ప్రతినిధులుగా చెప్పుకునే వారు కావాలనే తెలుగు పరిశ్రమను, తెలుగు దర్శక నిర్మాతలను, హీరో  హీరోయిన్లను కించపరిచేట్టుగా ప్రశ్నలు సంధిస్తున్నారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సురేష్ కొండేటి అనే వ్యక్తి మీద ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది.

డీజే టిల్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ పుట్టుమచ్చల మీద ప్రశ్నలు సంధించడం, హీరో హుందాగా సమాధానం చెప్పడం, హీరోయిన్ కాస్త సెటైరికల్ ట్వీట్లు వేసి సదరు మీడియా ప్రతినిధి మీద కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ప్రెస్ మీట్ నిర్వహణ మీద చాలా రకాల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ఏజెంట్ సినిమా ప్రెస్ మీట్‌లో వేసిన ప్రశ్నల మీద కూడా నానా రచ్చ జరిగింది.

 

ఇలా ప్రతీ ప్రెస్ మీట్‌లో ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్నలను అడగడం, లేదంటే తెలుగు మేకర్లను అవమానించేలా క్వశ్చన్స్ వేయడం పరిపాటి అయింది. ఇక నిన్న 2018 మూవీ ప్రెస్ మీట్‌లోనూ ఇలాంటి ప్రశ్ననే సురేష్‌ కొండేటి అడిగాడు. ఇలాంటి సినిమాను తీసే ధైర్యం, సాహసం తెలుగు వాళ్లు చేయగలరా? అంటూ కాస్త వ్యంగ్యంగా అడిగాడు. దీంతో హరీష్‌ శంకర్‌కు మండిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా హిందీ సినిమా అని లేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాను వాళ్లు అలానే చూశారా? బాహుబలిని డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అని కౌంటర్లు వేశాడు.

Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్

సినిమా బాగుంటే ఎక్కడైనా బాగుంటుందని కాస్త చురకలు అంటించాడు. ఇప్పుడు తెలుగు వారిని ప్రపంచం మొత్తం చూస్తుందని, ప్రతీ సారి ఇలానే కాంట్రవర్సీ ప్రశ్నలు వేసి ఫేమస్ అవుదామని అనుకుంటున్నట్టుగా కనిపిస్తుందని, ప్రశ్నలు వేయడానికి వచ్చావా? వాగ్వాదం పెట్టుకోవడానికి వచ్చావా? అంటూ ఇలా హరీష్‌ శంకర్ తన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నట్టుగా అనిపిస్తోంది.

Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News