Hanu Man OTT Streaming:హనుమాన్.. బాప్ ఆఫ్ ఆల్ సూపర్ హీరోస్.. అంతేకాదు అంతకు మించి అసలు సిసలైన కథానాయకుడు.బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్' మూవీ అందరి అంచనాలను మంచి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా విడుదలకు ముందు ఆ తర్వాత ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 17 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా స్ట్రీమింగ్ చేసిన 11 గంటల్లోనే ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సంచలనం రేపింది. అంతేకాదు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు జీ5ను 2024లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా ఈ సినిమా నిలబెట్టేలా ఉంది. వరల్డ్ వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌తో ZEE5 దూసుకెళ్తోంది. అందుకు కారణం ‘హను-మ్యాన్’. తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన స్టోరీలతో కూడిని సినిమాలను అందించడంలో ZEE5 ఎపుడు ముందుటుంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను జీ5తో పాటు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. హనుమాన్ సినిమా 2024లో తొలి హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గురించి ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి గెలిచింది. బడా హీరోలను తలదన్నే బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా టాలీవుడ్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా జీ5లో 8కి పైగా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
జీ 5 మన దేశపు యంగస్ట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. మల్టీలింగ్వుల్ సినిమాలతో ఈ ఓటీటీ ఫేమస్ అయింది. అంతేకాదు అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా పేరు తెచ్చుకుంది. దాదాపు 3500 పైగా సినిమాలున్న బిగ్గెస్ట్ లైబ్రరీ ఉన్న ఫ్లాట్‌ఫామ్ ఇది. 1750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్.. 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజపురి, గుజరాతి, పంజాబీలో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కొనసాగింది. విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ చిన్న చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని కొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో తెలుగులోనే కాదు.. మన దేశంలోనే తొలి హిట్‌గా నిలిచింది హనుమాన్ మూవీ. అంతేకాదు అమెరికా బాక్సాఫీస్ దగ్గర $ 5 మిలియన్ యూఎస్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది.
హనుమాన్ మూవీ రూ. 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి టాలీవుడ్‌లో మరే బడా హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పింది. గత కొన్నేళ్గుగా ఓ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్‌గా రూ. 100 కోట్ల లాభాలను ఆర్జించడం మాములు ఊచకోత కాదు. ఇదో రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి.
ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మీడియం రేంజ్ సంక్రాంతి సినిమాగా హనుమాన్ మరో రికార్డు. హిందీలో 'హనుమాన్' రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలంగాణ, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్, హిందీలో రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. హనుమాన్ సినిమాను ఇప్పటి వరకు థియేటర్స్‌లో కోటి మందికి పైగా వీక్షించారు. అది కూడా మాములు రికార్డు కాదు.
మరోవైపు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రూపేణా..మరో రూ. 50 కోట్ల అదనపు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరిగిన ఈ శుభవేళలో హను మాన్ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లను రాబట్టడం శుభ పరిణామం. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం "విజువల్ ఫీస్ట్"గా నీరాజనాలు అందుకుంది. మరి థియేట్రికల్‌గా మంచి విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు సూపర్ హిట్ అవుతుందో చూడాలి.
ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అంజనాద్రి ప్రాంతంలో అల్లరి చిల్లరిగా తిరిగే హనుమంతుని వాళ్ల అక్క అంజనమ్మ పెంచి పెద్ద చేస్తోంది. ఆ తర్వాత ఆ ఊరిపెద్దగా ఉంటూ అరాచకాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుడి శక్తులు పొందిన హనుమంతు దుర్మార్గుల అంతం ఎలా చేసేడనేదే హనుమాన్ మూవీ స్టోరీ.
ఆ సంగతి పక్కన పెడితే.. హనుమాన్ మూవీ క్లైమాక్స్‌లో ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అయోధ్య భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువైన శుభవేళలో ప్రకటించడం విశేషం. ఈ మూవీలో రానా ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా 'హనుమాన్'మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపిన ప్రశాంత్ వర్మ.. రాబోయే 'జై హనుమాన్' మూవీతో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తుందో చూడాలి.
Also read: Ys jagan vs Modi: ఉమ్మడి సభలో ప్రధాని మోదీ..జగన్‌పై ఎందుకు విమర్శలు చేయలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook