Guntur Kaaram: గుంటూరు కారంపై టికెట్ రేట్ల ప్రభావం.. ఇక ఆ నిర్ణయమే ఆలస్యం!

Guntur Kaaram Day 1 Collections: మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన సినిమా గుంటూరు కారం. మొదటిరోజు మిశ్రమ స్పందన సంపాదించుకున్న కానీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 11:18 AM IST
Guntur Kaaram: గుంటూరు కారంపై టికెట్ రేట్ల ప్రభావం.. ఇక ఆ నిర్ణయమే ఆలస్యం!

Guntur Kaaram Collections: సంక్రాంతికి ఎన్నో అంచనాల మధ్య జనవరి 12న విడుదలైన సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం ఇది. వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అతడు ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలలో ఒకటిగా ఉండే సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఖలేజా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఆ చిత్రానికి కూడా అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అన్నప్పుడు నుంచి చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

కానీ గుంటూరు కారం సినిమా‌ మొదటి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రానికి పోటిగా జనవరి 12న హనుమాన్ సినిమా కూడా దిగగా…ప్రేక్షకుల టాక్ గుంటూరు కారం కన్నా హనుమాన్ కి పాజిటివ్ గా వచ్చింది. దీంతో మొదటి రోజు గుంటూరు కారం మహేష్ బాబు పైన ఉన్న క్రేజ్ వల్ల కలెక్షన్లు విపరీతంగా వచ్చిన రెండోరోజు పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి అయోమయంలో పడింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా కాబట్టి…అందులో సంక్రాంతి సెలవులు కాబట్టి ఎలా అయినా ప్రేక్షకులు ఈ చిత్రం చూడడానికి మక్కువ చూపిస్తారు. అయితే యావరేజ్ గా ఉన్న పర్లేదు చూసేద్దాంలే అనుకున్నప్పుడు అందరి బుర్రలో నడుస్తోంది ఒకే విషయం.. ఈ సినిమాని ఇంత టికెట్ రేట్ పెట్టి చూడాలా అని. బడ్జెట్ రికవరీ కోసం అధికంగా పెడుతున్న టికెట్ రేట్లు డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు ఈ చిత్రం విషయంలో కనిపిస్తోంది. 

హైదరాబాద్ మల్టీప్లెక్సులో ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే గరిష్టంగా 470 రూపాయల దాకా ఉండటంతో.. సామాన్యులను.. థియేటర్లకు వచ్చే విషయంలో ఆలోచించేలా చేస్తోంది. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పర్లేదు కానీ టాక్ కొంచెం అటుఇటు ఊగినప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సిందే. అంత టికెట్ రేట్ పెట్టి యావరేజ్ సినిమా చూడడం ఎందుకు అనుకుంటున్నారు ప్రేక్షకులు.

కాబట్టి గుంటూరు కారం లాంగ్ రన్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోవాలంటే వీలైనంత త్వరగా టికెట్ ధరలను సాధారణ స్థితికి తేవడం అవసరం. ఎందుకంటే పోటీలో ఉన్న మిగిలిన నాలుగు సినిమాలు హైక్ కోరలేదు. హనుమాన్ సినిమాకి గుంటూరు కారం కన్నా టికెట్ రేట్ తక్కువగానే ఉంది. అదికాక ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఇక ఈ రెండు రోజుల్లో సైంధవ్, నా సామి రంగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ రెండు చిత్రాలకి కూడా టికెట్ ధరలు గుంటూరు కారం కన్నా తక్కువే. 

ముఖ్యంగా హనుమాన్ సినిమా తక్కువ టికెట్ రేట్లతో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తరహా ప్రభంజనం చూపిస్తోంది. సైంధవ్, నా సామిరంగలు సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో కావడంతో ఒక్క గుంటూరు కారమే అన్నింటి కన్నా ఖరీదుగా మారిపోయింది. కాబట్టి గుంటూరు కారం టీమ్ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే…కలెక్షన్స్ పరంగా ఈ సినిమా కొంచెం ఈ సంక్రాంతి సీజన్ ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే మాత్రం భారీ నష్టాల్లో మిగలాల్సిందే. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

 

Trending News