New year Special: ఫ్యాన్స్ కు న్యూ ఇయ‌ర్ ట్రీట్‌ ఇచ్చిన ఎన్టీఆర్ .. దేవర కొత్త పోస్టర్ మామూలుగా లేదు భయ్యా..

New year Special: టాలీవుడ్‌లో కొత్త సినిమా పోస్టర్‌లతో న్యూ ఇయ‌ర్ సంద‌డి మొదలైంది. దేవర నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. అంతేకాకుండా గ్లింప్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 01:46 PM IST
New year Special: ఫ్యాన్స్ కు న్యూ ఇయ‌ర్ ట్రీట్‌ ఇచ్చిన ఎన్టీఆర్ .. దేవర కొత్త పోస్టర్ మామూలుగా లేదు భయ్యా..

Devara Movie Update: ఫ్యాన్స్ కు న్యూఇయర్ ట్రీట్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొత్త సంవత్సరం సందర్భంగా దేవర కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో స‌ముద్రాన్ని చీల్చుకుంటూ వ‌స్తోన్న ప‌డ‌వ‌లో ఎన్టీఆర్ నిల్చొని ఇంటెన్స్ లుక్‌లో  క‌నిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ద్వారా ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. దేవ‌ర గ్లింప్స్‌ను జ‌న‌వ‌రి 8న విడుదల చేయనున్నట్లు తారక్ తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ లెవల్లో హైప్ పెంచేశాయి. న్యూఇయర్ పోస్టరే ఈ లెవల్లో గ్లింప్స్ ఏ లెవల్లో ఉంటుందోనని అభిమానుుల లెక్కలేసుకుంటున్నారు. 

 ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  ఇందులో తారక్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ నటిస్తోంది. ఈ మూవీ ద్వారా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జ‌న‌తా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఆడియెన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హ‌రి కోస‌రాజు, సుధాక‌ర్ మిక్కిలినేనితో క‌లిసి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. దేవర చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 05న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇందులో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Anupama Parameswaran: న్యూఇయర్ రోజు టిల్లుతో కలిసి రెచ్చిపోయిన అనుపమ.. మరి ఇంత బోల్డ్ గానా..

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కి ఆ అలవాటు ఉందని ఎవరూ అనుకోరు.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News