Bigg Boss 10th week Elimination : డేంజర్‌ జోన్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమా.. వేడుకున్న గలాట గీతూ

Bigg Boss 10th week Elimination బిగ్ బాస్ పదో వారంలో నామినేషన్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ వారం మాత్రం శ్రీహాన్, సత్య, ఫైమాలు డేంజర్ జోన్‌లో ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 05:28 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పదో వారం సందడి
  • డేంజర్ జోన్‌లో సత్య, ఫైమా, శ్రీహాన్
  • రంగంలోకి దిగిన గీతూ రాయల్
Bigg Boss 10th week Elimination : డేంజర్‌ జోన్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమా.. వేడుకున్న గలాట గీతూ

Bigg Boss 6 Telugu 10th week Elimination : బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిది వారంలో గీతూ బయటకు వచ్చింది. ఆమెకు బయటకు వచ్చే వరకు సంగతులేవీ అర్థం కాలేదు. అసలు బయట ఏం జరుగుతోంది.. ఏ కంటెస్టెంట్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది.. తన గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వీలుండదు. తన తప్పులు తెలుసుకునే సమయానికి ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటారు. బయటకు వచ్చాక కళ్లు తెరుచుకుంటాయి. తమ తమ తప్పులేంటో సరి దిద్దుకునే ప్రయత్నంచేస్తారు.

ఇప్పుడు గీతూ కూడా తన ఓవర్ కాన్ఫిడెన్స్‌ను తగ్గించుకుంది. తన తప్పులు ఒప్పుకుంది. తుప్పాస్ లూప్స్ అని అంగీకరించింది. అయితే తన రెడ్ టీం మాత్రం ప్రేమను చంపుకోలేకపోతోంది. శ్రీహాన్, సత్య, ఫైమాలకు గీతూ బాగానే కనెక్ట్ అయింది. అసలే ఈ వారం ఈ ముగ్గురూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. సత్య కెప్టెన్ కాబట్టి.. ఆమె ఎలాగూ ఎలిమినేట్ కాదు. శ్రీహాన్, ఫైమాలు ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉండటంతో రంగంలోకి గీతూ దిగింది.

ఐ మిస్ యూ మోర్.. మనిద్దరి కామెడీ, డ్యాన్స్ అన్నింట్లోనూ సింక్ ఉంది.. మీ అందరికీ తన వెటకారమే కనిపిస్తోంది.. కానీ శ్రీహాన్ ఒక మంచి మనిషి.. ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉంటే తట్టుకోలేదు.. అతను మంచి ఆటగాడు.. ఇంట్లో ఉండే అర్హత ఉంది.. చిన్న చిన్న తప్పులు మైండ్లో పెట్టుకుని గేమ్ ఆడే వాళ్లని బయట పంపకండది.. మల్లీ బిగ్ బాస్ శతమానం భవతి సినిమా అవుతుంది.. శ్రీహాన్‌కి ఓటు వేయండి అని కోరింది గీతూ.

ఇక ఫైమా గురించి చెప్పుకొచ్చింది. ఆమెకు ఇంట్లో ఉండేందుకు నిజంగా అర్హత ఉంది.. గేమ్ ఆడేవాళ్లని పంపేసి బిగ్ బాస్ ఏం చూస్తారండి.. తనకి కొంచెం వెటకారం ఉందేమో కానీ తన మనసు బంగారం.. లోపల ఉండేవాళ్లకి తెలీదు వాళ్ల నెగెటివిటీస్. బయటకు వచ్చాకే అర్థమవుతుంది.. తను బయటకు వచ్చేంత తప్పులు చేయలేదు.. ఆమె ఓ ప్లేయర్.. కెప్టెన్ అయితే నెక్ట్స్ వీక్ నామినేషన్స్‌లో ఉండదు.. కానీ ఈ వీక్ డేంజర్లోనే ఉంది.. ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చింది.. తన కలల్ని కూల్చకండి అంటూ ఫైమా కోసం వేడుకుంది గీతూ. సత్య చాలా మంచిది అంటూ గీతూ తన వీడియోలో చెప్పుకొచ్చింది.

Also Read : siddhant suryavanshi Death : వర్కౌట్లు చేస్తూ జిమ్‌లో కుప్పకూలిన సిద్దాంత్.. హార్ట్ ఎటాక్‌తో యంగ్ నటుడు మృతి

Also Read : Hero Nani Sister : నేనేదో పెద్ద టాలెంటెడ్ అనుకున్నా కానీ.. నాని పోస్ట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News