/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Game On Pre Release Event: గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'గేమ్ ఆన్'. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవి కస్తూరి నిర్మించారు.    
దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేసిన మాసివ్ ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంద‌ర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని దస్‌పల్లా  హోటల్‌లో  గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దాంతో పాటు  గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ను  లాంచ్ చేశారు. ఆ తర్వాత బిగ్ టిక్కెట్ ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. "ఈ సినిమా నేను చూశాను. మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ లా ఎక్కడా అనిపించలేదు. ప్యాక్డ్ స్క్రీన్ ప్లే తో రూపొందించారు. హీరో గీతానంద్ పర్ఫామెన్స్   బాగా చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.

మరో గెస్ట్ గా హాజరైన శివ బాలాజీ మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం హీరో, డైరెక్టర్ నాన్న కుమారే కారణం. వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దయానంద్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్‌గా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక  కూడా ఒక స్టోరీ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీత ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్మకం ఉంది. కథానాయికగా నటించిన నేహా సోలంకి బాగా నటించింది. టెక్నీషియన్స్ పరంగా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ బెస్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని చెప్పారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ.."ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే  సైకలాజికల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్,  ట్విస్టులు,  విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను చాలా కష్టాలు పడ్డాను. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలనుకున్నా. థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర దమ్మున్న సినిమా అనుకునేలా దీన్ని తెరకెక్కించమన్నారు. అలాంటి పవర్ ప్యాక్డ్ మూవీ ఇది. నిర్మాత రవి నాకు  క్లోజ్ ఫ్రెండ్. చాలా క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. తను నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. మా తమ్ముడు దయానంద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. కమలహాసన్ విక్రమ్ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్  గురించి ఎలా మాట్లాడుకున్నారో ఇందులో కూడా అలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అభిషేక్ అందించాడు. ప్రతి క్రాఫ్ట్ నెక్స్ట్ లెవెల్ లో అవుట్ పుట్ ఇచ్చారు. థియేటర్స్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది" అని చెప్పారు.

హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్టులో భాగమవడం గర్వంగా ఉంది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాననే సంతృప్తి ఉంది. నా పాత్రను డిజైన్ చేసిన డైరెక్టర్ దయానంద్ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులు సపోర్ట్ కావాలని చెప్పారు.

డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.."సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాపై అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ప్రతి సీను కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ఈ కంటెంట్ గురించి మాట్లాడతారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.  

నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.."మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ఇంత సక్సెస్ ఫుల్ గా రావడానికి టీమ్ లోని ప్రతి ఒక్కరూ కారణం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుందన్నారు.

Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
game on tollywood movie game on movie pre release event highlights ta
News Source: 
Home Title: 

Game On Pre Release Event: గ్రాండ్‌గా గేమ్ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైలెట్స్ ఇవే..

Game On Pre Release Event: గ్రాండ్‌గా గేమ్ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైలెట్స్ ఇవే..
Caption: 
Game On Movie Pre Release Event (Source/X)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Game On Pre Release Event: గ్రాండ్‌గా గేమ్ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైలెట్స్ ఇవే..
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 30, 2024 - 12:40
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
23
Is Breaking News: 
No
Word Count: 
521