Gaami Movie 4 Days WW Box Office Collections: 'గామి' మూవీ 4 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..

Gaami Movie 4 Days WW Box Office Collections:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమా నిన్నటితో 4 రోజుల కంప్లీట్ చేసుకుంది. మరి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2024, 03:10 PM IST
Gaami Movie 4 Days WW Box Office Collections: 'గామి' మూవీ 4 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..

Gaami Movie 4 Days Box Office Collections: తెలుగు యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్  ముఖ్యపాత్రలో నటించిన మూవీ 'గామి.  చాందిని చౌదరి మరో లీడ్‌ రోల్లో యాక్ట్ చేసింది.  విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో విశ్వక్‌సేన్ అఘోర క్యారెక్టర్‌లో మెప్పించాడు. మనుషుల స్పర్శను తట్టుకోలేని శంకర్ అనే అఘోర పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది.  రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా విడుదలైన రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ప్లస్‌గా మారింది. మొత్తంగా ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో పాటు సైన్స్, మూఢ నమ్మకాల సమ్మిళతంగా ఈ చిత్రాన్ని విద్యాధర్ కాగిత తెరకెక్కించాడు. మరోవైపు ఈ సినిమాకు నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ వర్క్స్ ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాలు పెద్దగా ఏమి లేకపోవడం ఈ సినిమాకు అనుకూలంగా మారాయి. 

ఈ సినిమా నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 6.62 కోట్ల షేర్ (రూ. 12.15 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.53 కోట్ల షేర్ (రూ. 18.10 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  కానీ  చిత్ర యూనిట్ అఫిషియల్‌గా రూ. 22.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ప్రకటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 1.47 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. 

ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.2 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 3.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 8.20 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10.20 కోట్లు..

విశ్వక్ సేన్ లాస్ట్ మూవీ 'దమ్కీ' మూవీ మంచి బిజినెస్ చేసింది. తాజాగా గామి సినిమా కూడా అదే రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో గామి బాక్సాఫీస్ దగ్గర స్టడీ వసూళ్లనే రాబడుతోంది. మొత్తంగా టెన్త్, ఇంటర్ విద్యార్ధుల పరీక్షలు ఉన్న ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. అదే కనుకగా హాలీడేస్‌ సీజన్‌లో విడుదలై ఉంటే  ఈ సినిమా వసూళ్ల రేంజ్ వేరే లెవల్లో ఉండేదనే టాక్ వినిపిస్తోంది.  

Read More: Aadhaar Cord Update: ఆధార్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్.. యూఐడీఏఐ తాజా నిర్ణయం ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News