FTPC: ఎఫ్ టీ పి సి ఇండియా జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్ గా నియమితులైన ప్రముఖ నిర్మాత గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)..

FTPP - Gotuuparti Madhukar: నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత గొట్టుపర్తి మధుకర్ తాజాగా ఎఫ్‌టీపిసీ ఇండియా జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

Last Updated : Apr 4, 2024, 07:53 PM IST
FTPC: ఎఫ్ టీ పి సి ఇండియా జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్ గా నియమితులైన ప్రముఖ నిర్మాత గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)..

FTPP - Gotuuparti Madhukar: నిర్మాతగా సునామి, ఇంద్రాణి వంటి పలు చిత్రాలను నిర్మించి సినిమా రంగాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా నియమితులయ్యారు. ఈయన్ని నియమిస్తూ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు చైతన్య జంగా , విజయ్ వర్మ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అధ్యక్ష కార్యదర్శలు అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు

చైతన్య జంగా మాట్లాడుతూ :- నేషనల్ లెవల్లో  సినిమా టెలివిజన్ కి సంబందించిన 24 సబ్ కమిటీల సమన్వయ చైర్మన్ గా ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి మధుకర్ తీవ్రంగా కృషి చేసారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మధుకర్ మాట్లాడుతూ..   అంతః రాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాల కై కృషి చేస్తానన్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసామన్నారు.  తాము ఈశాన్య రాష్ట్రాల కమిటీలను అతిత్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. తద్ఫలితంగా నట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకొనే అవకాశాలు మెరుగవుతాయని ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్ వర్మ పాకలపాటి అన్నారు.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News