Bangarraju Movie: బంగార్రాజు 'లడ్డుండా' సాంగ్ రిలీజ్..నాగార్జున స్టెప్పులు అదుర్స్!

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'బంగార్రాజు'. ఈ చిత్రం నుంచి 'లడ్డుండా' పాట విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 11:29 AM IST
Bangarraju Movie: బంగార్రాజు 'లడ్డుండా' సాంగ్ రిలీజ్..నాగార్జున స్టెప్పులు అదుర్స్!

Akkineni Nagarjuna: 'సోగ్గాడే చిన్ని నాయనా'(Soggade Chinni Nayana)’చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా‘'బంగార్రాజు'(Bangarraju). ఇందులో నాగార్జున(Akkineni Nagarjuna)తోపాటు ఆయన తనయుడు నాగచైతన్య సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘'లడ్డుండా'’ అనే లిరికల్‌ పాట(Lyrical song)ను మంగళవారం నాగార్జున విడుదల చేశారు. ధనుంజయ, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్‌ మోహన్‌ ఈపాటను ఆలపించారు. 

Also Read: Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం

‘'అబ్బాయ్‌ హార్మోనీ.. డంటకు డడనా' అంటూ పాటకు ముందు వచ్చే సాకీని నాగార్జున హుషారెత్తించేలా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోని నాగచైతన్య(Nagachaitanya) షేర్‌ చేస్తూ.. ‘‘నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరు’’అని ట్వీట్‌ చేశారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ(Ramya Krishna).. చైకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News