అరవింద సమేత షూటింగ్‌కి అనుకోని అతిథి !

అరవింద సమేత షూటింగ్‌కి పెళ్లి చూపులు దర్శకుడు 

Last Updated : Jun 23, 2018, 12:05 PM IST
అరవింద సమేత షూటింగ్‌కి అనుకోని అతిథి !

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత సినిమా షూటింగ్ స్పాట్‌కి శుక్రవారం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తారక్‌తో కాసేపు సరదాగా గడిపి, తారక్‌తో కలిసి ఓ ఫోటోకి కూడా ఫోజిచ్చి వెళ్లాడు. అతడు ఎవరో కాదు.. మొట్టమొదటిసారి పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ సినిమాతోనే రెండు జాతీయ అవార్డులు కొట్టేసిన ప్రతిభావంతుడు తరుణ్ భాస్కర్ ధాస్యం. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా డైరెక్ట్ చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్‌పై సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. తరుణ్ భాస్కర్ రాకతో కాసేపు అరవింద సమేత సెట్స్‌లో సందడి వాతావరణం కనిపించింది.

ఇక అరవింద సమేత షూటింగ్ వివరాలకొస్తే, ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వేగవంతంగానే జరుగుతోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తోంది. త్వరలోనే హైదరాబాద్ షూట్ ముగించుకుని పొల్లాచి వెళ్లనున్న మూవీ యూనిట్.. అక్కడ పలు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. పొల్లాచి షెడ్యూల్ తర్వాత అరవింద సమేత యూనిట్ విదేశాల్లో షూటింగ్‌కి వెళ్లనుంది. ఈ ఏడాది అక్టోబర్ 12న దసరా కానుకగా ఆడియెన్స్ ముందుకు రానున్న అరవింద సమేతకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Trending News