Mahesh Babu- Jr NTR: టాలీవుడ్ హీరోల నిజ స్వరూపం.. పైకి కనిపించేది నటనే.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

Bollywood cameraman about Tollywood: విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు.. అంటూ బాలీవుడ్ కెమెరా మ్యాన్ ఒకరు చేసిన.. షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాళ్లు పైకి మాత్రమే వినయంగా కనిపిస్తారు అంటే.. అని కెమెరా మ్యాన్ చెప్పుకొచ్చాడు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 9, 2024, 12:32 PM IST
Mahesh Babu- Jr NTR: టాలీవుడ్ హీరోల నిజ స్వరూపం.. పైకి కనిపించేది నటనే.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

Bollywood paps about Telugu star heroes: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ.. బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా చేయకపోయినా.. ఏదో ఒక సమయంలో వాళ్లు ముంబై ఎయిర్ పోర్ట్ లో.. కనిపిస్తూనే ఉంటారు. అలా కనిపించినప్పుడు బాలీవుడ్ మీడియా కంటికి కూడా చిక్కుతూనే ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు పైకి కనిపించే అంత వినయంగా మాత్రం ఉండరు అని.. ఒక కెమెరా మ్యాన్ చెబుతున్నాడు.

ముంబై బెస్డ్ ఫోటోగ్రాఫర్ వరిందర్ చావ్లా.. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కనిపించేంత వినయంగా తెలుగు హీరోలు ఉండరు అని.. వారి కంటే బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా వరకు బెటర్ అని..తెలుగు హీరోల లాగా పైకి నటించరు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి చెప్పుకొచ్చారు. 

ఒక హీరో కావాలని ప్రమోషన్స్ టైమ్ లో.. సింపుల్ గా ఉండడం కోసం చెప్పులు వేసుకుని వస్తారని.. కానీ అది కేవలం నటనేనని అన్నారు వరిందర్. దీంతో హోస్ట్ ఆ హీరో విజయ్ దేవరకొండ అని అడగగా.. వరిందర్ అవును అనేసారు. ఈ మధ్యనే తన టీమ్ ఒక పెద్ద సౌత్ స్టార్ తో షూట్ చేశామని.. హోటల్ లోపలికి వెళ్తున్న టైం లో ఆ హీరో మీడియా మీద విరుచుకుపడ్డారని.. ఆ వీడియోని పోస్ట్ చేయలేదని చెప్పాడు వరిందర్. 

ఆ హీరో పేరు చెప్పకపోయినాప్పటికీ అది జూనియర్ ఎన్టీఆర్ వీడియో. ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక మీడియా వ్యక్తిపై ఎన్టీఆర్ కెమెరా లోపల పెట్టమని.. గట్టిగా అరుస్తూ చెప్పడం.. ఆ వీడియోలో క్లియర్ గా కనిపించింది.

ఇక గతంలో మహేష్ బాబు.. బాలీవుడ్ తనని ఎఫర్డ్ చేయలేదు అన్న కామెంట్లను గురించి మాట్లాడుతూ.. చాలా బాధగా అనిపించిందని.. వాళ్ళు పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు అని.. కేవలం బయట నటిస్తారు అంటూ కామెంట్లు చేశారు వరిందర్. నిజానికి మహేష్ బాబు టీం.. ఆ సమయంలోనే మహేష్ బాబు అన్న దాని ఉద్దేశం వేరు అని, ఆయనకి అన్ని భాషల సినిమాల మీద గౌరవం ఉంది అని క్లారిటీ ఇచ్చారు.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News