Pushpa 2 IT Raids: అద్భుతమైన కథతో ప్రపంచవ్యాప్తంగా ఆల్‌టైమ్ షోలు, రికార్డ్స్‌తో పాన్ వరల్డ్ విజయం పొందిన పుష్ప 2: ది రూల్ సినిమాకు కష్టాలు సుడిగుండాల్లా మారాయి. ఒకటి కాకుంటే మరోటి ఏదో ఒక వివాదం చిత్రబృందాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట.. అల్లు అర్జున్ అరెస్ట్.. పైరసీ.. తాజాగా ఐటీ దాడులతో పుష్ప 2 బృందం కకావికలమవుతోంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయ సాధించిందనే సంతోషం లేకుండాపోతోంది.
Also Read: Akhanda 2 Movie: లొకేషన్ల కోసం అన్వేషణ.. అఖండ 2 'పని' మొదలుపెట్టిన బోయపాటి
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 4వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ప్రీమియర్ షో మొదలుకుని నేటి వరకు ఈ సినిమా ప్రేక్షకుల విశేష ఆదరాభిమానంతో దూసుకెళ్తోంది. అయితే రికార్డులు.. కలెక్షన్లతోపాటు వివాదాలు కూడా పుష్ప 2ను చుట్టుముడుతున్నాయి. సినిమా విడుదలైన రోజు నుంచి నేటి వరకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
Also Read: Tirumala Actors: తిరుమలలో 'సార్' హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఇతర ప్రముఖులు కూడా
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. కుట్రపూరితంగా అల్లు అర్జున్‌పై వ్యవహరించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయంగా కూడా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు పుష్ప 2 చిత్రబృందంపై దాడులు చేయడం కలకలం రేపుతోంది.
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, ఎర్నేని నవీన్‌లను ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టడంతో వాటికి సంబంధించిన ఆధారాల కోసం ఐటీ అధికారులు దాడులు చేశారు. వసూళ్లు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ నిర్ధారణ చేయడం కలకలం రేపింది. అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ నివాసంలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి సుకుమార్‌ను అతడి ఇంటికి తీసుకెళ్లారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.