Director Krish: పరారీలో దర్శకుడు క్రిష్‌..? డ్రగ్స్ కేసులో కీలక మలుపు..?

Director Krish: డ్రగ్స్ కేసులో తవ్వే కొద్ది సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు బయటకు వచ్చాయి. అందులో టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌ పేరు బయటకు రావడం సంచనలం రేపుతోంది. ఈ కేసులో విచారణకు క్రిష్ పోలీసులు హాజరు కావాల్సిన ఉన్నా.. ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 29, 2024, 09:29 AM IST
Director Krish: పరారీలో దర్శకుడు క్రిష్‌..? డ్రగ్స్ కేసులో కీలక మలుపు..?

Director Krish: కొన్ని రోజులు క్రితం రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. పోలీసుల విచారణలో ఒక్కో పేరు బయటకి వస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా చేర్చారు. ఈ కేసులో ఏ -10 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే క్రిష్ పై CrPc 160 కింద నోటీసులు జారీ చేసినట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇదే కేసులో మరో ఇద్దరు పేర్లను నిందితులుగా FIRలో చేర్చారు. ఈ కేసులో ఏ 11గా ప్రవీణ్ డైరెక్టర్ , ఏ 12గా డ్రగ్ సరఫరా దారు మీర్జా వహీద్ బేగ్ పేర్లను చేర్చారు.

ఇక పోలీసుల దర్యాప్తులో దర్శకుడు క్రిష్ పేరు బయటకు రావడంతో  విచారణకు పిలిచారు. అయితే పోలీసులు పిలిచినప్పుడు క్రిష్ ఇక్కడ అందుబాటులో లేకపోడంతో విచారణకు రాలేకపోయారట. ఆరోజు రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి తాను వెళ్లినట్లు క్రిష్ ఇప్పటికే ఒప్పుకున్నారు. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని.. అక్కడ తన ఫ్రెండ్ ని కలిసి వచ్చానని మాత్రమే చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఆ పార్టీలో దర్శకుడు క్రిష్‌తో పాటు మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానంద్ చెప్పిన మేరకే అతని డ్రైవర్ ప్రవీణ్‌కు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ కొకైన్ డెలవరీ చేశాడని విచారణలో పోలీసులు తేల్చారు.

ఈ నెల 24న వివేక్ తన స్నేహతులైన దర్శకుడు క్రిష్, రఘుచరణ్, కేదార్‌నాథ్, సందీప్, శ్వేత, లిషి డ్రగ్స్ ఉపయోగించినట్టు పోలీసులు తేల్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పార్టీ కోసం వివేక్ చేసిన వాట్సాప్ చాటింగ్‌ను కేసులో ప్రధాన సాక్ష్యంగా తీసుకున్నట్టు తెలిపారు.మరి పోలీసులు  చెబుతున్న క్రిష్ నిజంగా  డ్రగ్స్ తీసుకున్నారా..? లేదా..? అసలు ఏం జరిగింది అనే దాని పైన పూర్తి వివరాలు తెలియాలి అంటే పోలీస్ విచారణ ముగిసే వరకు వేచి చూడాలి. మరి ఈ కేసులో వీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయమై కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. మరి క్రిష్ పరారీ నేపథ్యంలో అతనిపై ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశాలున్నాయి.

క్రిష్‌ విషయానికొస్తే.. తెలుగులో డిఫరెంట్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గమ్యంతో దర్శకుడిగా మారిన ఈయన ఆ తర్వాత వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. 

Also Read: Dil Raju: పాలిటిక్స్ లోకి రాబోతున్న దిల్ రాజు.. నిజమెంత?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News