Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Janhvi Kapoor Visited Tirumala Temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 01:07 PM IST
Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Janhvi Kapoor visits Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు. ఈమె శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిలో సేవలో పాల్గొన్నారు. జాన్వీతోపాటు సీనియర్ నటి మహేశ్వరి కూడా కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇరువురికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా జాన్వీ చీర కట్టులో ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తిరుమల టూర్ ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో బీటౌన్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. భైర అనే పాత్రలో సైఫ్ సందడి చేయనున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. దేవర పార్ట్‌ 1 వరల్డ్ వైడ్ గా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో మూడు రోజుల్లో అంటే జనవరి 08న ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Also Read: Guntur Kaaram: త్రివిక్రమ్ ఏ తప్పు చేసినా కళ్లు మూసుకుంటారు.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్లు

Also Read: Ibomma Telugu: సింపుల్‌గా సింగిల్ క్లిక్‌తో ఐ బొమ్మ వన్‌లో ఇలా కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News