Aho Vikramarka Teaser Talk Review: రామ్ చరణ్ ‘మగధీర’ విలన్ దేవ్ గిల్ హీరోగా 'అహో! విక్రమార్క'.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్..

Aho Vikramarka Teaser Talk Review: రాజమౌళి హీరోగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘దేవ్ గిల్’. ఈయన హీరోగా నటించిన మూవీ ‘అహో విక్రమార్క’. ప్యాన్ ఇండియా భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 05:40 AM IST
Aho Vikramarka Teaser Talk Review: రామ్ చరణ్ ‘మగధీర’ విలన్ దేవ్ గిల్ హీరోగా  'అహో! విక్రమార్క'..  టీజర్ కు సూపర్ రెస్పాన్స్..

Aho Vikramarka Teaser Talk Review: బ్లాక్‌బస్టర్ 'మగధీర' మూవీతో  పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు చేస్తూ అలరిస్తోన్న నటుడు దేవ్ గిల్. తాజాగా ఈయన స్వీయ నిర్మాణంలో  దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి 'అహో! విక్రమార్క' అనే మొదటి సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.  ఈ మేరకు ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవ్‌గిల్ మాట్లాడుతూ..
‘మగధీర’ సినిమా నుంచి నా మీద అభిమానం చూపిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అప్పటి నుంచి నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. పూణెలో మా తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉండొచ్చు.. కానీ హైద్రాబాద్‌లో రాజమౌళి నాకు పేరు ఇచ్చారు. రమా గారు నాకు తల్లిలా సపోర్ట్ ఇచ్చారు. వారి వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’ అనే చిత్రాన్ని నిర్మించగలిగే స్థాయికి చేరానన్నారు. దాదాపు పుష్కరం క్రితమే రాజమౌళి నన్ను ముంబై నుంచి పట్టుకొచ్చి నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేను హీరోగా సినిమాను తీశానంటే అది రాజమౌళి వల్లే అన్నారు. ఈ సినిమా నిర్మించడం నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నన్ను ఇంత వరకు విలన్‌గా చూశారు. ఇకపై హీరోగా నా నటనను చూడండి.  కానీ ఈ సినిమాతో మీ అందరికీ సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నాను. త్రికోటి గారికి చాలా పెద్ద విజన్ ఉంది. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలు కూడా రిలీజ్ చేయబోతున్నాము. మా సినిమా మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించి, ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు.

యువరాజ్ మాట్లాడుతూ..
‘నేను ఈ మూవీ ప్రొడక్షన్ టీమ్ లో పని చేశాను.తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. దేవ్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఓ ఆర్టిస్ట్‌గా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. తెలుగు ప్రజలంతా ఈ సినిమాను ఆధరిస్తారని కోరుకుంటున్నాన్నారు.  

దేవ్‌గిల్ భార్య, నిర్మాత ఆర్తి మాట్లాడుతూ..
‘మా కల నెరవేరబోతోంది. ఇదే మాకు మొదటి చిత్రం. మా ప్రొడక్షన్ నుంచి మొదటి చిత్రం రాబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ.. ‘మగధీర నుంచి దేవ్‌గిల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచీ టచ్‌లోనే ఉన్నాము. హీరోగా ఓ సినిమా చేద్దామని ఆయన చెబుతూనే ఉండేవారు. ఆయనకు ఎలాంటి కథ అయితే బాగుంటుందా? అని ఆలోచించాను. పోలీస్ కథ అయితే బాగుంటుందని అనుకుని ప్రాజెక్ట్ అలా స్టార్ట్ చేశాము. తెలుగు, హిందీ భాషల్లో షూటింగ్‌ను చేశాం. మంచి సినిమా చేశాం. ఆడియెన్స్ మా సినిమాను చూసి ఆదరించాలని కోరకుంటున్నాను.

ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘నేను మారాఠీ చిత్ర సీమలో పని చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాలో సౌత్ ఇండియా పరిశ్రమ, టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతీ ఒక్క నటుడు ఇక్కడ పని చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మా ఆర్టిస్టులు మహేష్ మంజ్రేకర్, షాయాజీ షిండే వంటి వారున్నారు. విలన్‌గా ఈ చిత్రంలో నన్ను తీసుకున్నారు. మొదటి సారిగా నేను సౌత్‌కి పరిచయం కాబోతున్నాను.

నటి చిత్రా శుక్లా మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. పెళ్లి అయిన తరువాత రాబోతోన్న మొదటి చిత్రమిదే. ఈ కథను నెరేట్ చేసేందుకు ఆఫీస్‌కు పిలిచారు. ఆ ఆఫీస్‌లోకి అడుగు పెట్టడంతోనే రాజమౌళి ఫోటో కనిపించింది. ఎంతో పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది.

Also Read: IND Vs AFG Dream11 Team Prediction: సూపర్-8లో అఫ్ఘాన్‌తో భారత్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News