South Indian Movies: తెలుగు, తమిళ సినిమాలకు ఉత్తరాదిన పెరుగుతున్న క్రేజ్, భారీగా రీమేక్‌లు

South Indian Movies: ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో దక్షిణాది సినిమాల క్రేజ్ నడుస్తోంది. దక్షిణాది సినిమాల ప్రభావానికి ఉత్తరాది సినిమాలు విలవిల్లాడుతున్నాయి. అందుకే ఇప్పుడు రీమేక్‌లు భారీగా పెరిగిపోతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2022, 09:11 AM IST
 South Indian Movies: తెలుగు, తమిళ సినిమాలకు ఉత్తరాదిన పెరుగుతున్న క్రేజ్, భారీగా రీమేక్‌లు

South Indian Movies: ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో దక్షిణాది సినిమాల క్రేజ్ నడుస్తోంది. దక్షిణాది సినిమాల ప్రభావానికి ఉత్తరాది సినిమాలు విలవిల్లాడుతున్నాయి. అందుకే ఇప్పుడు రీమేక్‌లు భారీగా పెరిగిపోతున్నాయి. ( Remake of South indian movies of telugu and tamil movies in hindi)

తెలుగు, తమిళ ఆధారిత పాన్ ఇండియా మూవీలు పెద్దఎత్తున వస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేశ్ బాబులకు ఇప్పటికే ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా అభిమానులు పెరుగుతున్నారు. అంతకుమించి ఉత్తరాదిన..ఇటీవల కొద్దికాలంగా దక్షిణాది సినిమాల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా దక్షిణాది సినిమా హీరోల దెబ్బకు ఉత్తరాది సినిమా పరిశ్రమ కదిలిపోతోంది. రొటీన్ ప్రేమ కధా చిత్రాలతో విసిగిపోయిన ఉత్తరాదికి..దక్షిణాది విలక్షణ కధాంశాల సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అవుతున్న పరిస్థితి. 

అందుకే ఇప్పుడు దక్షిణాది సినిమాలను ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలను ఉత్తరాదిలో పెద్దఎత్తున రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు పాన్ ఇండియా మూవీలు బాహుబలి, కేజీఎఫ్, సాహో, పుష్పలు సంచలనం రేపగా, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, లైగర్ సినిమాలు  సంచలనం రేపేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు దక్షిణాదికి చెందిన దాదాపు 25 సినిమాలను బాలీవుడ్ పరిశ్రమ రీమేక్ చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ 25 సినిమాల్లో అగ్రభాగం తెలుగు, తమిళ సినిమాలే కావడం గమనార్హం.

తెలుగు నుంచి అల వైకుంఠపురం, జెర్సీ, హిట్, నాంది, ఛత్రపతి సినిమాలున్నాయి. అటు తమిళం నుంచి కైతి, జిగర్తాండ, అన్నియన్, విక్రమ్ వేద, ధ్రువంగళ్ పతినారు, రాత్ససన్, తాడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్ సినిమాలున్నాయి. ఇక మళయాలం నుంచి డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్ వంటి సినిమాలున్నాయి. టాలీవుడ్ హీరో ప్రభాస్ చేతిలోనే ఆరు పాన్ ఇండియా సినిమాలున్నాయి. అటు పుష్ప హిందీ వెర్షన్ ఉత్తరాదిలో ఓ సంచలనంగా మారిపోయింది. దేశం మొత్తానికి పుష్ప మేనియా పట్టుకుంది. మొత్తానికి దక్షిణాదిలోని తెలుగు, తమిళ సినిమాలకు ఉత్తరాదిలో ఇప్పుడు క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది.

Also read: Salaar Movie: డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ ..రెండు పార్ట్‌లుగా ఉండనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News