అలీ లేకుండా పవన్ 'అజ్ఞాతవాసి'?

పవన్ కళ్యాణ్ కుబెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా.. అంటే అందరికీ గుర్తొచ్చేది కమెడియన్ అలీ. తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్

Last Updated : Dec 20, 2017, 08:29 PM IST
అలీ లేకుండా పవన్ 'అజ్ఞాతవాసి'?

పవన్ కళ్యాణ్ కుబెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా.. అంటే అందరికీ గుర్తొచ్చేది కమెడియన్ అలీ. తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్. పవన్-అలీ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో చాలా హిట్టయ్యాయి కూడా. ఖుషి, తమ్ముడు, బద్రి.. ఈ మధ్యలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు. పవన్ జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు కూడా అలీ హాజరయ్యారు. ఖురాన్ పఠించారు. పవన్ కు ఆలీ సెంటిమెంట్. ఆ విషయాన్ని బహిరంగానే పవన్ చెప్పారు కూడా. 

అలంటి అలీ.. అజ్ఞాతవాసి టీజర్ లో గానీ, ఆడియో ఫంక్షన్ లో గానీ ఎక్కడా కనిపించలేదు. దాంతో అందరికీ అలీ 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించాడా?లేదా? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి అభిమానుల్లో.  కాల్షీట్స్ కుదరకే చేయలేదా?లేక ఇంకేమైనా కారణం ఉందా? అనేది ఇంకా తెలియాలి. రావు రమేష్, మురళి శర్మల మద్య కామెడీ సమ్మివేశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే సినిమాలో ఉన్నవారందరినీ టీజర్ లో చూపించలేం కదా.. అను అంటున్నారు సినిమా యూనిట్. 

అలీ ఫంక్షన్ గైర్హాజరీపై స్పందించారు. నేను ప్రీవియస్ కమిట్మెంట్ దృష్ట్యా ఫారెన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాను. అయినా రెండు రోజులు గ్యాప్ తీసుకొని వస్తా అని అలీ చెప్తే..  ఏం వద్దు. అక్కడ నిర్మాతలకు ఇబ్బందిపెట్టవద్దు. ఇప్పుడు నువ్వు రాకపోతే ఫంక్షన్ ఏమీ ఆగిపోదు. అని పవన్ అలీకి చెప్పారట. ఏదీ ఏమైనా అలీ లేని లోటు నిన్న ఫంక్షన్ లో స్పష్టంగా కనిపించింది.  

ఏదేమైనా పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసిలో అలీ లేకపోతే మాత్రం పవన్ అభిమానులకు బాధాకరమైన విషయమే..! 

Trending News