Thangalaan OTT Streaming: ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన విక్రమ్ ‘తంగలాన్’ మూవీ..

Thangalaan OTT Streaming: జాతీయ ఉత్తమ నటుడు  చియాన్ విక్రమ్ కథానాయకుడు యాక్ట్ చేసిన చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్  దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ చిత్రాన్ని  స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం మంచి టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఎపుడో విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అయింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 11, 2024, 02:50 PM IST
Thangalaan OTT Streaming: ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన విక్రమ్ ‘తంగలాన్’ మూవీ..

Thangalaan OTT Streaming: చియాన్ విక్రమ్ కథానాయకుడు యాక్ట్ చేసిన భారీ  పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం "తంగలాన్". తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్  ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘తంగలాన్’ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఆగస్టు 15న థియేట్రికల్ గా విడుదలైన ఈ సినిమా  "తంగలాన్" చియాన్ విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్  దాటింది. తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందనుంది.

‘తంగలాన్’ సినిమాను  దర్శకుడు పా రంజిత్ రూపొందించారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.మొత్తంగా ఈ సినిమా టెక్నికల్ గా బాగున్నా.. కథ పరంగా ఈ సినిమా వీక్ ఉందనే టాక్ వినిపించింది.
 
"తంగలాన్" సినిమాలో చియాన్ విక్రమ్ సరసన పార్వతీ తిరువోతు, మాళవిక మోహన్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెబుతున్నారు.  దర్శకుడు ఈ చిత్రాన్ని వాస్తవ విరుద్ధంగా తెరకెక్కించినట్టు కొంత మంది చరిత్ర కారులు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మొత్తంగా ఈ మూవీ క్లోజింగ్ కలెక్సన్ విషయానికొస్తే..

తమిళనాడులో ఈ సినిమా రూ. 37.90 కోట్ల గ్రాస్..
తెలుగు రాష్ట్రాలు.. రూ. 9.30 కోట్ల గ్రాస్..
కర్ణాటక.. రూ. 4.50 కోట్ల గ్రాస్..
కేరళ.. రూ. 3.25 కోట్ల గ్రాస్..
రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 0.90 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 16.90 కోట్ల గ్రాస్..
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.75 కోట్ల గ్రాస్.. (రూ. 34.55 కోట్ల షేర్) రాబట్టింది.

‘తంగలాన్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.  ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 34.55 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం థియేట్రికల్ గా రూ. 34 కోట్ల భారీ నష్టాలను తీసుకొచ్చింది.

తంగలాన్ సినిమాలో బంగారం వేటలో రెండు తెగల మధ్య వార్ నేపథ్యంలో దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించాడు. తన తెగ వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడి క్యారెక్టర్ లో  విక్రమ్ నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ఈ పాత్రలో విక్రమ్ ఒదిగిపోయిన తీరుకు మంచి అప్లాజ్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమా కోసం విక్రమ్ సరికొత్తగా ఒదిగిపోయినా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. మొత్తంగా థియేట్రికల్ ఈ సినిమాను మిస్ అయిన వారు ఇపుడు ఎంచక్కా ఓటీటీలో చూడొచ్చు. 

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News