Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి Vs పవన్ కళ్యాణ్.. అన్నదమ్ముల సవాల్..

Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి Vs పవన్ కళ్యాణ్‌.. పొలిటికల్‌గా వీళ్లిద్దరిది వేరు వేరు దారులు.. ఇప్పటి వరకు వీళ్లిద్దరు పాలిటికల్ విషయాల్లో విభేదించిన సినిమాలు.. కుటుంబ విషయాల్లో అంతా ఒకటిగా ఉంటారు. తాజాగా వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర ఒకరి సినిమాలతో మరొకరు ఢీ అంటే ఢీ అనబోతున్నారు.

Last Updated : Feb 15, 2024, 07:28 AM IST
Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి Vs పవన్ కళ్యాణ్.. అన్నదమ్ముల సవాల్..

Chiranjeevi Vs Pawan Kalyan: అవును ఇప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర ఎపుడు పోటీ పడలేదు. కానీ తొలిసారి 2025 సంక్రాంతి బరిలో ఒకరి సినిమాతో మరొకరు ఢీ అంటే ఢీ అనబోతన్నట్టు సమచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక చిరు కెరీర్‌లో 'యముడికి మొగుడు', జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' సినిమాల తర్వాత రాబోతున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

మరోవైపు ఈ సినిమాకు చాలా యేళ్ల తర్వాత ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలు రిలీజ్ చేయనున్నారు. ఈ కోవలో పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న 'OG' మూవీని ఈ యేడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

మరోవైపు క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ 'హరి హర వీరమల్లు' మూవీని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు పోటీలో ఉన్న ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. అది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. మరి ఇప్పటి వరకు అన్నయ్య చిరుతో తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడని తమ్ముడ పవన్ కళ్యాణ్ రాబోయే సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అంటారా అనేది చూడాలి.

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News