Chiranjeevi - Shivarajkumar: మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా మిగతా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన సంగతి తెలిసిందే కదా. ఇక పేద పద్మ అవార్డు గ్రహీతలకు నెలకు రూ. 25 వేలు చొప్పున పెన్షన్ ఇవ్వనున్నట్టు ప్రకటించడమే కాకుండా.. రూ. 25 లక్షల చెక్‌ను అందజేసారు.
ఇక చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్.. చిరంజీవిని ఆయన ఇంట్లో ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఇక తన ఇంటికి వచ్చిన శివన్నతో కలిసి భోజనం చేసారు చిరంజీవి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శివన్న రీసెంట్గా ధనుశ్ హీరోగా నటించిన 'కెప్టెన్ మిల్లర్' మూవీతో పలకరించారు. ఈ సినిమా పెద్దగా అలరించ లేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి గతేడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో పలకరించారు. ఇందులో వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ అందుకుంటే.. భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. మరోవైపు చిరు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టేనర్ చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు జై హనుమాన్ మూవీలో హనుమాన్ వేషం వేయనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook