chiranjeevi-Radhika : చిరు రాధిక కాంబోలో సినిమా.. నాడు ఇచ్చిన మాటకోసమేనా?

chiranjeevi New Movie చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి లైనప్‌ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంకో సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 01:31 PM IST
  • వరుస చిత్రాలతో బిజీగా చిరంజీవి
  • మాస్టర్ ప్లాన్ వేసిన రాధిక శరత్ కుమార్
  • నాడు ఇచ్చిన మాట కోసం చిరు ఇలా
chiranjeevi-Radhika : చిరు రాధిక కాంబోలో సినిమా.. నాడు ఇచ్చిన మాటకోసమేనా?

chiranjeevi New Movie చిరంజీవి రాధిక మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే.ఈ ఇద్దరూ కలిసి దాదాపు 25 సినిమాల్లో నటించినట్టున్నారు. వీరిది తెలుగులో సూపర్ హిట్ కాంబినేషన్. వీరి స్నేహం ఇప్పటిది కాదు. గత రెండు దశాబ్దాలుగా ఈ స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక రాధిక, రాధిక భర్త శరత్ కుమార్ ఇద్దరూ కూడా చిరంజీవి ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉంటారు. ఓ సందర్భంలో శరత్ కుమార్ పరిస్థితి ఏమీ బాగోలేదట. ఆ సమయంలో చిరంజీవి డేట్స్ సంపాదిస్తే చాలు.. డబ్బుల వస్తాయని కోలీవుడ్ నిర్మాతలు చెప్పారట.

దీంతో చిరంజీవిని డేట్స్ అడిగేందుకు శరత్ కుమార్ వచ్చాడట. ఏ మాత్రం ఆలోచించకుండా డేట్స్ ఇస్తానని అన్నాడట. దీంతో శరత్ కుమార్ ఫుల్ ఖుషీ అయ్యాడట. అయితే శరత్ కుమార్‌కు మళ్లీ పరిస్థితులు చక్కబడటంతో ఆ డేట్స్ వాడుకోలేదట. చిరంజీవి కూడా తన సినిమాలతో బిజీగా అయిపోయాడట. ఇప్పుడు మళ్లీ చిరంజీవి డేట్స్ తీసుకునేందుకు రాధిక, శరత్ కుమార్‌లు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాధిక తన బ్యానర్లో చిరంజీవితో ఓ సినిమా తీయాలని భావిస్తోందట. ఇక రాధిక అడిగితే చిరంజీవి నో చెప్పే చాన్స్ ఉండదు. పైగా నాడు ఇచ్చిన మాట ఉండనే ఉంది. దీంతో చిరు కోసం రాధిక మంచి కథలను వినే పనిలో పడింది. చిరు సైతం కొన్ని కథలు విని రెడీగా ఉన్నాడట. ఏ కథ ఫైనల్ అవుతుంది.. దర్శకుడు ఎవరు అన్నది తెలియడం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఉంటుందని అర్థమవుతోంది.

వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని సమాచారం. ముందు అయితే రాధిక, చిరులు సరైన కథ కోసం అన్వేషిస్తున్నారట. చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్యను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆ తరువాత భోళా శంకర్‌ను కంప్లీట్ చేస్తాడు. ఆపైనే ఇంకో సినిమా గురించి ఆలోచించేలా ఉన్నాడు.

Also Read : Prashanth Neel Bagheera : భగీరా లుక్ అదిరింది.. ప్రశాంత్ నీల్, హోంబళే కొత్త సినిమా అప్డేట్

Also Read : Sai Pallavi Movies : సైలెంట్ అయిన సాయి పల్లవి.. సినిమాలకు ఇక పూర్తిగా దూరమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News