Chiranjeevi - Time Square : మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. 2024 యేడాదికి గాను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో గౌరవించింది. దీంతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్ వద్ద బిల్ బోర్డ్‌లో చిరంజీవి విజువల్స్‌ను పంచుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు యూఎస్‌కు చెంఇన కుందవరపు శ్రీనివాస్ నాయుడు అనే చిరు అభిమాని.
మరోవైపు చిరుకు కేంద్రం పద్మ విభూషణ్‌తో గౌరవించడంతో ఆయన అభిమానులతో పాటు సినీ రంగ ప్రముఖులు ఆయన్ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగులో ఏఎన్నాఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న సినీ ప్రముఖుడు చిరు కావడం విశేషం. చిరంజీవికి గతంలో 2006లో కేంద్రం పద్మ భూషణ్‌తో గౌరవించింది. దాదాపు 18 యేళ్ల తర్వాత మరో అత్యున్నత పౌర పురస్కారం చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చింది.
ప్రస్తుతం చిరంజీవి.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి