PV Sindhu: పీవీ సింధుకు చిరంజీవి సత్కారం...మెగాస్టార్ ఇంట్లో సందడి చేసిన తారలు!

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సత్కరించారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇప్పడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 08:03 PM IST
PV Sindhu: పీవీ సింధుకు చిరంజీవి సత్కారం...మెగాస్టార్ ఇంట్లో సందడి చేసిన తారలు!

PV Sindhu: బ్యాడ్మింటన్‌ విభాగంలో పీవీ సింధు కాంస్యం పతకం సాధించి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సింధును చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan)లు ఘనంగా సత్కరించారు. దీంతో చిరంజీవి(Chiranjeevi)ఇంట్లో పీవీ సింధూ ఫ్యామిలీ సందడి చేసింది. సింధూ(PV Sindhu)ను చిరంజీవి సహా పార్టీకి హాజరైన పలువురు ప్రముఖులు సత్కరించారు. ఈ పార్టీకి ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. నాగార్జున, రానా, అఖిల్, శర్వానంద్, రాధిక, సుహాసిని, అల్లు అర్వింద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్‌  తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అందరూ సింధూతో ఫోటో దిగారు. ఈ వీడియోను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

''దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధు(PV Sindhu)ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది'' అని చిరంజీవి పేర్కొన్నారు. అందరూ స్టార్స్ ఒక దగ్గర సందడి చేయటంతో..ఈ వీడియో నెట్టింట వైరల్(Viral)గా మారింది. 'ఈ వీడియో చూసిన తరువాత మనసంతా ఉల్లాసంగా అనిపించింది, సింధుకి శుభాకాంక్షలు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

https://www.instagram.com/tv/CTH2RGAhZLM/

Also Read: Sitara: సూపర్ స్టార్ డాటర్ సరికొత్త వీడియో..నెట్టింట వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News