Chiranjeevi Jagan meet : జగన్‌తో చిరంజీవి భేటీ వర్క్‌ అవుట్‌, 10 రోజుల్లో గుడ్ న్యూస్, కొత్త జీవో!

Chiranjeevi.. CM YS Jagan meet, Cinema tickets rates issue : సినిమా టికెట్‌ రేట్లపై సీఎం వైఎస్‌ జగన్‌, మెగాస్టార్ చిరంజీవి భేటీ. గంటన్నర పాటు చిరు, జగన్ మధ్య సాగిన భేటీలో.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చ సాగింది. 10 రోజుల్లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి కొత్త జీవో వ‌స్తుంద‌న్నారు చిరు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 04:26 PM IST
  • గంటన్నర పాటు చిరు, జగన్ మధ్య భేటీ
  • తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చ
  • 10 రోజుల్లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి కొత్త జీవో వ‌స్తుంద‌న్న చిరు
  • ఇండ‌స్ట్రీలో ఉన్నవారంతా ఎలాంటి స్టేట్మెంట్స్‌ ఇవ్వొద్దు
Chiranjeevi Jagan meet : జగన్‌తో చిరంజీవి భేటీ వర్క్‌ అవుట్‌, 10 రోజుల్లో గుడ్ న్యూస్, కొత్త జీవో!

Chiranjeevi CM YS Jagan meet Megastar Chiranjeevi says Good news in 10 days : సినిమా టికెట్‌ రేట్ల అంశంతో పాటు పలు విషయాలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో (AP CM YS Jaganmohan Reddy) హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు చిరు, జగన్ మధ్య భేటీ కొనసాగింది. ఇక ఈ సమావేశంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి (Telugu Film Industry) సంబంధించిన అనేక అంశాలపై వారిద్దరూ చర్చించారు. ప్రధానంగా సినిమా టికెట్‌ రేట్ల (Movie ticket rates) అంశాన్ని చిరంజీవి.. సీఎం జగన్‌ (CM Jagan‌) దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆహ్వానం మేరకే.. జగన్‌తో, చిరంజీవి భేటీ అయ్యారు. 

ఇక భేటీ తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరిన మెగాస్టార్ చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి (Gannavaram Airport) చేరుకుని మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌తో చాలా సంతృప్తికరంగా, ఆనందంగా భేటీ జరిగిందని చిరంజీవి తెలిపారు. ఈ పండుగ పూట ఒక సోదరుడిగా తనని ఆహ్వానించి విందు భోజనం పెట్టడం ఆనందంగా ఉందని చిరు చెప్పుకొచ్చారు. తనతో సీఎం ఆప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చిందని చిరు చెప్పారు. అలాగే సీఎం సతీమణి భారతి వడ్డించటం సంతోషంగా ఉందన్నారు.

10 రోజుల్లో గుడ్ న్యూస్ (Good news in 10 days) రావొచ్చని, ఏపీ ప్ర‌భుత్వం నుంచి కొత్త జీవో (New GO) వ‌స్తుంద‌ని ఆశిస్తున్నానని చిరంజీవి చెప్పారు. అంద‌రూ సంయ‌మ‌నం పాటించండి అని కోరారు. ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఎగ్జిబిట‌ర్ల ప్ర‌తినిధుల‌ను పిలిచి... సీఎం మీటింగ్ పెడ‌తామ‌న్నారని చిరు తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల స‌మ‌స్య‌కు (movie ticket rates issue) ఫుల్‌స్టాప్ ప‌డుతుందని మెగాస్టార్ చెప్పారు. 

ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్‌కు వివరించానని చిరంజీవి తెలిపారు. సినిమా టికెట్‌ రేట్స్‌ (Movie Ticket Rates) పెంచాలని, పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరానని చిరు చెప్పారు.

Also Read : Punjab AAP CM Candidate: ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసిన కేజ్రీవాల్...

అయితే సినీ ఫీల్డ్ బ‌య‌ట‌కు క‌న్పించేంత గ్లామ‌ర్ ఫీల్డ్ కాదన్నారు చిరంజీవి. రెక్కాడితేకాని డొక్కాడ‌ని కార్మికులు ఇండ‌స్ట్రీలో ఉన్నారన్నారని తాను సీఎంకు వివరించానని చెప్పుకొచ్చారు చిరంజీవి. క‌రోనా స‌మ‌యంలో సినీ కార్మికులు ఇబ్బందులు ప‌డ్డారని తెలిపారు. ఇక సినీ ఇండ‌స్ట్రీలో (Cine Industry) ఉన్నవారంతా ఎలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వొద్దని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సూచించారు. ఏదో మంచి చేయాల‌న్న ఆలోచ‌న ఏపీ ప్ర‌భుత్వం (AP Government) వైపు నుంచి ఉందని చిరంజీవి పేర్కొన్నారు. తాను ఒకే ప‌క్షాన ఉండ‌ను.. అంద‌రినీ స‌మ‌దృష్టితో చూస్తాన‌ని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని చిరు తెలిపారు. భ‌య‌ప‌డొద్ద‌ని భ‌రోసా ఇచ్చారని.. జగన్ మాట‌లు తనకు ధైర్యమిచ్చాయని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు. 

Also Read : Anasuya Bharadwaj: లంగాఓణీలో మెరిసిన అనసూయ.. నడుము వొంపులు మాములుగా లేవుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News