Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే

Chiranjeevi Acharya TRP rating మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి వెనుకే ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 01:13 PM IST
  • బుల్లితెరపై తగ్గుతున్న టీఆర్పీలు
  • సీనియర్ హీరోల్లో చిరు చివరి స్థానం
  • ఆచార్యకు టీఆర్పీ ఆరు పాయింట్లే?
Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే

Chiranjeevi Acharya TRP Rating : ప్రస్తుతం బుల్లితెరపై సినిమాలను చూసేందుకు జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇదే కనుక కొనసాగితే.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ మీద పెద్ద ప్రభావం పడనుంది. సినిమాలను దాదాపు అందరూ కూడా తమకు నచ్చినప్పుడు, నచ్చిన చోట,ఎక్కువ యాడ్స్ లేకుండా ఈజీగానే చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే జనాలు అక్కడి వరకు వస్తున్నారు. తాము పెట్టే డబ్బులకు తగ్గ చిత్రం కాదని అనిపిస్తే జనాలు నిరభ్యంతరంగా చీ కొట్టేస్తున్నారు.

పెద్ద హీరోల సినిమాలా? చిన్న హీరోల చిత్రాలా? అన్నది జనాలు చూడటం లేదు. కంటెంట్ బాగుంటే సినిమాలను ఆదరిస్తున్నారు. అలా ఈ ఏడాది దారుణమైన డిజాస్టర్లను టాలీవుడ్ చూసింది. అందులో చిరంజీవి ఆచార్య చిత్రం ఒకటి. ఈ సినిమాకు దాదాపు తొంభై నుంచి వంద కోట్ల నష్టం వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. ఓటీటీలోనూ ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు జెమిని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కడా ఈ చిత్రానికి భారీ దెబ్బ తగిలింది. ఆచార్య సినిమాకు ఏడు పాయింట్ల కంటే తక్కువగా రేటింగ్ వచ్చింది. ఇంత తక్కువ రేటింగ్ రావడంతో ఇప్పుడు జనాలు పోలికలు మొదలుపెట్టేశారు. ఆచార్య సినిమాకు 6.3 రేటింగ్ రాగా.. బాలయ్య అఖండకు 13.31, నాగ్ బంగార్రాజుకు 14, వెంకీ ఎఫ్ 3 మూవీకి 8.26 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

ఇలా సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికే అత్యంత తక్కువగా రేటింగ్ వచ్చింది. దీంతో మరోసారి ఆచార్యను ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ సినిమా విషయంలో చిరంజీవి, కొరటాల శివను ఎలా ఆడేసుకున్నారో అందరికీ తెలిసిందే. చిరంజీవే కథను గెలికి ఉంటాడని కొందరు అంటే.. కొరటాల శివే కథ మీద కాకుండా బిజినెస్ మీద ఫోకస్ పెట్టి సినిమాను పక్కన పెట్టేశాడని అంటున్నారు. మొత్తానికి ఆచార్య మాత్రం ఈ ఏడాది డిజాస్టర్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్ కొట్టేసింది.

Also Read : Sreemukhi Photoshoot : శ్రీముఖి.. అందాల చెకుముఖి.. భారీ ఎక్స్‌పోజింగ్‌తో పిచ్చెక్కిస్తోన్న యాంకర్

Also Read : మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News