Shilpa Shetty-Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa Shetty), ఆమె భర్త రాజ్‌కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబయికి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు.
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా(Raj Kundra) ప్రారంభించిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51లక్షలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని సదరు వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ పేరు!
2014లో ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ కాన్, శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాతో పాటు ఇతరులు తమ సంస్థలో రూ.1.51కోట్లు పెట్టుబడి పెట్టాలని తనను కోరినట్లు తెలిపారు నితిన్. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ(SFL Fitness Pvt Ltd) తనకు ఫ్రాంచైజీ కేటాయిస్తుందని.. పుణెలోని హడప్సర్, కోరేగాన్లలో జిమ్, స్పా తెరుస్తుందని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదని, అందుకే తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే వారు బెదరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. పోర్నోగ్రఫీ కేసులో జులైలో అరెస్టైన రాజ్‌కుంద్రా..సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ ఇంతలోనే ఈ దంపతులపై చీటింగ్ కేసు నమోదవడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook