Chaari 111 Movie Review: 'చారి 111' గా వెన్నెల కిషోర్ మెప్పించడా .. ? సినిమా ఎలా ఉందంటే.. ?

Chaari 111 Movie Review: వెన్నెల కిషోర్.. తెలుగులో బ్రహ్మాందనం తర్వాత ఈ రేంజ్‌లో అలరిస్తోన్న కమెడియన్. సినిమా ఏదైనా తన మార్క్ కామెడీతో మెప్పించడం వెన్నెల కిషోర్ స్టైల్.   ప్రస్తుతం తెలుగులో ఈయన లేని బడా స్టార్ హీరోల సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఓ వైపు కమెడియన్‌గా అలరిస్తూనే అపుడపుడు హీరోగా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా 'చారి 111' అనే మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 1, 2024, 01:14 PM IST
Chaari 111 Movie Review: 'చారి 111' గా వెన్నెల కిషోర్ మెప్పించడా .. ? సినిమా ఎలా ఉందంటే.. ?

రివ్యూ: చారి 111 (Chaari 111)
నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, తాగుబోతు రమేష్, సత్య, తదితరులు
సినిమాటోగ్రఫీ: కషిష్ గ్రోవర్
ఎడిటర్: రిజర్డ్ కెవిన్
సంగీతం: సైమన్ కే కింగ్
నిర్మాత: అదితి సోనీ
దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
విడుదల తేది: 1-3-2024

Chaari 111 Movie Review: వెన్నెల కిషోర్.. కేరాఫ్ కామెడీ అని చెప్పాలి. డిఫరెంట్ మాడ్యులేషన్.. ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ ప్లస్ లో ఇంగ్లీష్ పదాలతో కామెడీని పండించడం వెన్నెల కిషోర్ మార్క్ స్లైల్. తాజాగా ఈయన 'చారి 111' మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో వెన్నెల కిషోర్ నవ్వించి మెప్పించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
మన దేశంలో క్యాప్సిల్ బాంబ్స్‌తో దేశంలో పలు చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటారు ట్రెర్రరిస్టులు. వారికి కొంత మంది దేశ ద్రోహులు సహకరిస్తూ ఉంటారు. టెర్రరిస్టుల ఆగడాలను అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రుద్రనేత్ర అనే సీక్రెట్ సర్వీసు ఏర్పాటు చేస్తోంది. దీనికి మురళీ శర్మ హెడ్. ఆ ఏజెన్సీలో చారి (వెన్నెల కిషోర్) పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేస్తారు. దాన్ని రుద్రనేత్ర ఏజెన్సీ సహాయంతో చారి ఎలా అడ్డుకున్నాడు. దానికి అతను ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
దర్శకుడు టీజీ కీర్తి కుమార్ ఈ సినిమాను జంధ్యాల.. చంటబ్బాయి స్పూర్తితో తెరకెక్కించినట్టు చెప్పాడు. ఓ సీరియస్ సబ్జెక్ట్‌లో కామెడీ పండించాలనే ప్రయత్నం చేసాడు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌తో నవ్వులు పంచే ప్రయత్నం చేసాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం వెన్నెల కిషోర్ పాత్ర చుట్టే తిప్పుతూ లాజిక్‌ను పక్కన పెట్టేసాడు. ప్రేక్షకులు కూడా సీరియస్ సబ్జెక్ట్‌ను దర్శకుడు కామెడీగా చేసినా.. పెద్దగా పట్టించుకోలేదు. ఆడియన్స్ కూడా వెన్నెల కిషోర్ అంటే కామెడీనే ఎక్స్‌పెక్ట్ చేసి వస్తారు. అది పూర్తిగా అందించడంలో సఫలమయ్యాడు దర్శకుడు. విలన్ పాత్రను ఏదో బడా హీరో సినిమా లెవల్లో చూపించినా.. చివరి వరకు ఆ టెంపోను కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. ఇక రాహుల్ రవీంద్రన్‌తో వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలెట్.  మొత్తంగా సీరియస్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథ విషయంలో ఇంకాస్తా శ్రద్ద వహిస్తే బాగుండేది. చివర్లో బాంబ్ బ్లాస్ట్‌లో హీరో చనిపోయినట్టు చూపిస్తారు. ఆ తర్వాత అతను ఎలా బతికి బయటపడ్డానే విషయాన్ని చూపిస్తే బాగుండేది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదను పెడితే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. చారి 111 సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసాడు. ఈ పాత్రలో అతను తప్పించి మరో నటుడిని ఊహించుకోలేము. మొత్తంగా చారి పాత్రలో ఆడియన్స్‌ను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మురళీ శర్మ రుద్రనేత్ర హెడ్ పాత్రలో ఒదిగిపోయాడు.హీరోయిన్‌గా సంయుక్తా విశ్వనాథన్ తన పరిధి మేరకు నటించింది. మిగిలిన పాత్రల్లో నటించిన సత్య, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్

వెన్నెల కిషోర్ కామెడీ
 
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఎడిటింగ్

లాజిక్ లేని సీన్స్

క్లైమాక్స్

పంచ్ లైన్.. చారి 111.. వెన్నెల నవ్వులు..

రేటింగ్.. 2.75/5

Also read: Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News