Jawan Movie: 'మహేష్‌తో కలిసి జవాన్‌ సినిమా చూస్తా..': షారుఖ్

Jawan Movie: మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు షారుఖ్ జవాన్ మూవీ రానుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ తోపాటు సెలబ్రెటీలు సైతం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 02:13 PM IST
Jawan Movie: 'మహేష్‌తో కలిసి జవాన్‌ సినిమా చూస్తా..': షారుఖ్

Mahesh Babu tweet on  Jawan Movie: 'జవాన్' మూవీ రిలీజ్  కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో జవాన్(Jawan Movie) ప్రేక్షకుల మందుకు రానుంది. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ మూవీకి ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకు తెలుగులో కూడ మంచి హైప్ ఉంది. పఠాన్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ తోపాటు సినీ  సెలబ్రెటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మహేష్ బాబు(Mahesh Babu). 

‘జవాన్ టైమ్‌ వచ్చేసింది. షారుక్ ఖాన్ ఈసారి తన పవర్ మొత్తాన్ని చూపించనున్నాడు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ’ మహేష్ వేసిన ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై షారుఖ్ ఖాన్ కూడా స్పందించాడు. ''థాంక్యూ మై ఫ్రెండ్ . ఈ సినిమాను మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి మీతోపాటు కలిసి సినిమా చూసేందుకు నేను రెడీ'' అంటూ షారుఖ్ రిప్లై ఇచ్చాడు. 

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఇందులో షారుఖ్ జోడిగా నయనతార నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో దీపికా పదుకొనె, దళపతి విజయ్ గెస్ట్ రోల్స్ చేశారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌ నిర్మిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. ఇది  హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

Also Read: Jailer Producer: గొప్ప మనసు చాటుకున్న జైలర్‌ ప్రొడ్యూసర్.. అపోలో ఆస్పత్రికి కోటి రూపాయల విరాళం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News