Adipurush Movie: ఆదిపురుష్‌తో సైఫ్ అలీ ఖాన్ తెలుంగేట్రం, తరువాతి సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో

Adipurush Movie: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ ఇంకా వివాదం సమసిపోలేదు. మరోవైపు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ హోరు కొనసాగుతోంది. సినిమా సంగతెలా ఉన్నా..తెలుగునాట అడుగెడుతున్న బాలీవుడ్ నటుడు ఈ సినిమాతో తెలుంగేట్రం చేసేసినట్టే.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 11:06 PM IST
Adipurush Movie: ఆదిపురుష్‌తో సైఫ్ అలీ ఖాన్ తెలుంగేట్రం, తరువాతి సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో

Adipurush Movie: ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదలైన పాన్ ఇండియా సినిమా సూపర్ డూపర్ కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో రావణుడి పాత్రలో అలరించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు చేరువౌతున్నాడు. తెలుగులో సైఫ్ అలీ ఖాన్‌కు ఇది తొలి సినిమా కావడం విశేషం.

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదం రేగుతోంది. హనుమంతుడిచే పలికించిన డైలాగ్స్ అసభ్యకరంగా ఉన్నాయని, కొన్ని సన్నివేశాలు హిందూవుల మనోభావాల్ని దెబ్బతీశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. సినిమా రచయిత మనోజ్ ముంతషిర్ శుక్లాకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. అయినా వెనక్కి తగ్గని మనోజ్ శుక్రా క్షమాపణలు చెప్పనంటున్నారు. ఇంత వివాదం రేగుతున్నా సినిమా మాత్రం సూపర్ కలెక్షన్లు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లు దాటేసింది.

ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకు ప్రభాస్ పారితోషికంగా 100-150 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక రావణుడి పాత్రలో కన్పించిన సైఫ్ అలీ ఖాన్ 12 కోట్లు పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాతోనే తెలుంగేట్రం చేశాడు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్‌కు ఇదొక్కటే కాదు..అసలు సిసలు ఒరిజినల్ తెలుగు సినిమా మరొకటి ఉంది. అదిప్పుడు షూట్ దశలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ పాత్ర పోషించనున్నాడు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో శక్తివంతమైన విలన్ పాత్ర పోషిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య సన్నివేశాల్ని సైతం భారీగా పవర్ ఫుల్‌గా చిత్రీకరించనున్నారని సమాచారం. తెలుగు నాటి మేటి తార దివంగత శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. 

Also read; Adipurush 3rd Collections: బాక్సాఫీస్ వద్ద 'ఆదిపురుష్' కలెక్షన్ల సునామీ.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News