Akshay kumar: ఓ మై గాడ్ 2 చుట్టూ వివాదం, అక్షయ్ కుమార్‌పై 10 లక్షల రివార్డు

Akshay kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. అక్షయ్ నటించిన ఓ మై గాడ్ 2 సినిమాపై వివాదం రేగుతోంది. వివాదం ఎందాకా వెళ్లిందంటే..అతడిపై 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 13, 2023, 01:15 AM IST
Akshay kumar: ఓ మై గాడ్ 2 చుట్టూ వివాదం, అక్షయ్ కుమార్‌పై 10 లక్షల రివార్డు

Akshay kumar: ఆగస్టు 11 అంటే శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైన ఓ మై గాడ్ 2 సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అటు బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు వసూలయ్యాయి. శివుని పాత్రలో కన్పించిన అక్షయ్ కుమార్‌పై వివాదం మొదలైంది. ఆ వివాదం ఖరీదు అక్షరాలా 10 లక్షల రూపాయలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ఓ వైపు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మరోవైపు వివాదం అంతకంతకూ పెరుగుతోంది. అక్షయ్ కుమార్ శివుని పాత్రలో నటించిన ఓ మై గాడ్ 2 సినిమా ఆగస్టు 11న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదలై భారీ కలెక్షన్లు కూడా నమోదు చేసింది. తొలిరోజే 10 కోట్లు వసూలైనట్టు సమాచారం. లైంగిక విద్య అవసరం, ప్రాధాన్యత గురించి అమిత్ రాయ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రాష్ట్రీయ హిందూ పరిషత్ సహా కొన్ని హిందూ సంఘాలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శివునితో పాటు శివభక్తుల్ని ఈ సినిమా అవమానించేలా ఉందనేది భక్తుల ఆరోపణ. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు అక్షయ్ కుమార్ దిష్టిపొమ్మను దగ్దం కూడా చేశాయి. 

ఈ సినిమాలో శివ భక్తుడిగా కన్పించే పంకజ్ త్రిపాఠి కొడుకు కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. కొడుకుకి లైంగిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఓ పనికి పాల్పడ్డాడని గ్రహించి..అదే అంశంపై కోర్టులో కేసు దాఖలు చేస్తాడు. అటు కష్టాల్లో ఉన్న భక్తుడిని ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ శివాజ్ఞపై భూమికి వస్తాడు. 

ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలనే డిమాండ్ విన్పిస్తోంది. ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అయితే అక్షయ్ కుమార్‌ను చెంప దెబ్బ కొట్టినవారికి ఏకంగా 10 లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించింది. ఇదొక సందేశాత్మక సినిమా. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మనోజ్ త్రిపాఠితో పాటు యామీ గౌతమ్, పవన్ మల్హోత్ర, గోవింద నామ్‌దేవ్, బ్రిజేంద్ర కాలా నటించారు. ఈ సినిమా విడుదల తరువాత ఈ వివాదం రేపితే విడుదలకు ముందు పలు వివాదాలు సృష్టించింది. 18 ఏళ్లలోపు పిల్లల్ని సినిమా చుూడవద్దంటూ నిషేధం విదించింది. 

Also read: Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2కు అరుదైన రికార్డు, ఇన్‌స్టా చరిత్రలో ఇదే తొలిసారి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News