Rajamouli:
మహాభారతాన్ని సినిమాటిక్ గా రూపొందించడం తన చిరకాల కోరిక అని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చాలా సార్లు అన్నారు. ఎప్పటికైనా మహాభారతం ను 8 భాగాలుగా సినిమా తీయాలి అని, అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి అద్భుతమైన సినిమాలు తీసిన రాజమౌళి మహాభారతం తీయడానికి బాగా సెట్ అవుతారు అని అభిమానులు కూడా నమ్మారు కానీ ఈలోగా బాలీవుడ్ ఆ ఆశల పై నీళ్ళు చల్లినట్టు అయ్యింది.
హిందీ లో మంచి హిట్ అయిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇప్పుడు రాజమౌళి తో పాటు ఫ్యాన్స్ కి కూడా పెద్ద షాక్ ఇచ్చారు. వివేక్ తాజాగా తన భార్య పల్లవి జోషి నిర్మించిన మూడు భాగాల మహాభారతం లోని 'పర్వ' అనే మొదటి భాగం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సడన్ ప్రకటన తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఎప్పటికైనా ఈ భారీ ప్రాజెక్ట్ ను రాజమౌళి టేకప్ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో అంతకంటే ముందే బాలీవుడ్ స్వంత మూడు భాగాల మహాభారతాన్ని ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చింది. రాజమౌళి వంటి టాలెంటెడ్, ఎక్స్పీరియన్స్, విజన్ ఉన్న వ్యక్తి ఈ సినిమా తీస్తే కచ్చితంగా అది నెక్స్ట్ లెవల్లో ఉంటుంది మరి ఇప్పుడు బాలీవుడ్ ఈ ప్రాజెక్ట్ చేసేస్తే రాజమౌళి మళ్ళీ ఈ కాన్సెప్ట్ ను టేకప్ చేస్తాడా లేదా అని బాధపడుతున్నారు.
ఇప్పటికే "ఆది పురుష్" పేరుతో బాలీవుడ్ రామాయణాన్ని చూపించిన విధానం పై అందరూ కోపం గా ఉన్నారు. ఈ సమయంలో లో ఇప్పుడు బాలీవుడ్ మరొక ఎపిక్ మీద బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తుందా అని డైరెక్ట్ గానే కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కొందరు ఫ్యాన్స్ మాత్రం మహాభారతం, రామాయణం వంటి ఎపిక్స్ మీద ఎవరైనా ఎన్ని సార్లైనా సినిమాలు తీయచ్చని, బాలీవుడ్ ముందుగానే ఇలాంటి ప్రకటించినా కూడా అందులో ఆందోళన చెందడానికి ఏమి లేదని కొందరు వాదిస్తున్నారు.
మరోవైపు రాజమౌళి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. వీరి కాంబో లో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయడం లో తలమునకలై ఉన్నారు. ఇక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. సినీమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Also Read: Kalyan Ram Devil : నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook