Pan India Movies: పాన్ ఇండియా సినిమాలంటే ఎలా ఉంటాయో చూపించింది తెలుగు సినిమానే. బాహుబలి కావచ్చు. పుష్ప కావచ్చు. తెలుగు సినిమాల కమర్షియల్ సత్తా ఏంటనేది చాటిచెప్పాయి. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యలు తెలుగు సినిమా సత్తా ఏంటో చెబుతున్నాయి. దక్షిణాది సినిమాల గురించి ముఖ్యంగా తెలుగు సినిమాల గురించి అతడు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాదికి రుచించకపోయినా..దక్షిణాదివారిని ఆకట్టుకుంటున్నాయి. ఓ చర్చాగోష్టిలో పాన్ ఇండియా సినిమాలంటే ఎలా ఉండాలో చెప్పాడు కరణ్ జోహార్. తెలుగు సినిమాలపై ప్రశంసలు కురిపించాడు.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలు చేసినంత బిజినెస్ లేదా కలెక్షన్లు హిందీ సినిమాలు చేయడం లేదని కరణ్ జోహార్ చెప్పాడు. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన అల్లు అర్జున్ సినిమా పుష్ప గురించి ప్రస్తావిస్తూ తెలుగు సినిమాల కమర్షియల్ సామర్ధ్యమేంటనేది చెప్పాడు. పుష్ప సినిమా (Pushpa Movie)ఏ విధమైన ప్రమోషన్స్ లేకుండా..కేవలం కొద్దిపాటి పోస్టర్లతో, ట్రైలర్‌తో మెగా హిట్ అయిందని చెప్పాడు. అల్లు అర్జున్ ఉత్తరాదికి పెద్దగా తెలియకపోయినా..సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద మెగా కలెక్షన్లు సృష్టించిందన్నారు. అటువంటి పరిస్థితిని మీరు ఊహించగలరా..పాన్ ఇండియా క్రేజ్ అంటే ఇదే మరి అని కరణ్ జోహార్ (Karan johar) వ్యాఖ్యానించాడు. అసలు పాన్ ఇండియా అనే పదమే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ప్రారంభమైందని చెప్పాడు. బాహుబలి 1 ఒక్కటే 112 కోట్ల బిజినెస్ చేసిందన్నాడు. అదే సమయంలో రాజమౌళి ఈగ హిందీ సినిమా కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే సంపాదించిందన్నాడు.
రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) కచ్చితంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేస్తుందని..తొలిరోజు ఒక్కటే హిందీ వెర్షన్ 30 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నాడు. అయితే కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరాది నుంచి ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.
Also read: Sunny Leone Song: 'మధుబన్' సాంగ్ వివాదం..ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న 'అరెస్ట్ సన్నీలియోన్' హ్యాష్ టాగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి