Priyanka chopra visiting chilkur Balaji temple video: హైదరాబాద్ లో ఉన్న అనేక ఆలయాలలో చిలుకూరు బాలాజీ ఆలయం కూడా ఒకటి . ఇక్కడ ప్రతి రోజు వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఇక్కడ ఆలయంలో ప్రదక్షిణలు చేయడంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వీఐపీ ట్రీట్మెంట్ ఉండదు. అందరు భక్తుల మాదిరిగానే వీఐపీలను సైతం ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా యువత వీసాల కోసం ఎక్కువగా వస్తుంటారు. అందుకే వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం చిల్కురు ఆలయంను దర్శించుకున్నారు.
#PriyankaChopra visits Chilkur Balaji Temple, Hyderabad.
'With the blessings of Shri Balaji, a new chapter begins : PC on Insta'#SSRajamouli #MaheshBabu pic.twitter.com/beHeiiVCCb
— Gulte (@GulteOfficial) January 21, 2025
కొన్ని రోజుల క్రితం నటి లాస్ ఎంజెల్స్ నుంచి హైదరబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా బాలాజీ ఆలయంకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం పూజారులు ప్రియాంక చోప్రాకు.. ఆలయ ప్రాముఖ్యత, స్వామి వారి చరిత్ర గురించి వివరించారు.
ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కనున్న రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారని టాక్ నడుస్తొంది. అయితే అధికారికంగా మాత్రం.. మూవీ టీమ్ దీనిపై ప్రకటన చేయలేదు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్ కు రావడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా స్వామి వారిని దర్శించుకున్నారు. చిల్కురు బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్నట్టు పోస్ట్‌లో పెట్టారు.
“శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. దేవుడి ఆశీస్సులతో అందరు బాగుండాలని.. శాంతి, శ్రేయస్సులు కల్గాలని కోరుకున్నారు. అంతే కాకుండా.. చివరన.. రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Read more: Saif Ali Khan Video: ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన సైఫ్ అలీఖాన్.. వీడియో ఇదే..
ఈ క్రమంలో ఉపాసన స్వామి వారి దర్శనం కలిగేలా గైడ్ చేశారని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా స్వామివారి ఆలయంను దర్శనం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter