Nora Fatehi: బాలీవుడ్ ముద్దుగుమ్మ, టెంపర్ బ్యూటీ నోరా ఫతేహీ ఇన్‌స్టాపై హ్యాకర్ల కన్ను

Nora Fatehi: బాలీవుడ్‌లో నోరా ఫతేహీ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి..ఎక్కౌంట్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు హ్యాకర్లు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2022, 02:48 PM IST
Nora Fatehi: బాలీవుడ్ ముద్దుగుమ్మ, టెంపర్ బ్యూటీ నోరా ఫతేహీ ఇన్‌స్టాపై హ్యాకర్ల కన్ను

Nora Fatehi: బాలీవుడ్‌లో నోరా ఫతేహీ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి..ఎక్కౌంట్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు హ్యాకర్లు.

బాలీవుడ్ గ్లామరస్ క్వీన్, టెంపర్, బాహుబలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నోరా ఫతేహి. స్పెషల్ సాంగ్స్ నోరా ఫతేహీ ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు ఎక్స్‌పోజింగ్ కలిపి అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటోంది. అటు అన్నింటికంటే మించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. హాట్‌హాట్ ఫోటోలతో మైమరపిస్తుంటోంది. సోషల్ మీడియా ఎక్కౌంట్‌తో అందర్నీ అలరించే నోరా ఫతేహీ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్ ఒక్కసారిగా కన్పించకపోవడంతో అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. 

రెండ్రోజుల క్రితం గుర్తు తెలియని హ్యాకర్లు కొందరు నోరా ఫతేహీ(Nora Fatehi) ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత రాత్రికి మళ్లీ రీస్టోర్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా నోరా ఫతేహీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారని..అయితే తన టీమ్ తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించిందని పేర్కొంది. హైపర్ యాక్టివ్ ముద్దుగుమ్మ నోరా పతేహీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 37 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. పులి పిల్లలకు ఆహారం పెడుతున్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయింది. 

Also read: Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాలు, 75 మిలియన్ల వ్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News