Bigg Boss Telugu: సీజన్-4 ప్రోమో విడుదల

తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ (Bigg Boss ) నాలుగో సీజన్ షో త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ( star maa) తాజాగా ప్రోమోను విడుదల చేసి షో అంచనాలను మరింత పెంచింది. 

Last Updated : Aug 16, 2020, 08:44 AM IST
Bigg Boss Telugu: సీజన్-4 ప్రోమో విడుదల

Nagarjuna host on Bigg Boss telugu season-4: తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ ( Bigg Boss ) నాలుగో సీజన్ షో త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ( star maa) తాజాగా ప్రోమోను విడుదల చేసి షో అంచనాలను మరింత పెంచింది. అత్యుత్తమమైన రేటింగ్స్‌తో గత మూడు సీజన్లల్లో దూసుకెళ్లిన బిగ్‌బాస్ షో.. నాలుగో సీజన్‌ ( Bigg Boss telugu season-4 ) కు సరికొత్తగా ప్రచారాన్ని ప్రారంభించింది. అందరూ ఊహించనట్లుగానే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ( Nagarjuna ) మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ట్రిపుల్ యాక్షన్‌లో తాత, కొడుకు, మనవడిగా కనిపించి.. బిగ్‌బాస్ షో ఎలా ఉండబోతుందో చెప్పి అంచనాలను మరింత పెంచారు.

ఇరుగుపొరుగు వారిళ్లలో జరిగే గిల్లికజ్జాలను చూసి ఎంటర్ టైన్‌మెంట్ పొందుతున్న తాత, కొడుకు మధ్యలోకి మనవడు వచ్చి ఓ సర్ ప్రైజ్ చేస్తాడు. మై డియర్ ఇంటి సభ్యుల్లారా.. ఇంతకంటే వందరేట్లు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ మేము అందిస్తాం అంటూ బిగ్‌బాస్-4 గురించి అనౌన్స్ చేస్తారు. Also read: Big Boss: సీజన్ 4 హోస్ట్ గా నాగార్జున పారితోషికం ఎంతో తెలుసా

స్టార్‌ మాలో 2017లో ప్రారంభమైన బిగ్‌బాస్‌ షో ప్రతి సిజన్‌లోనూ ప్రేక్షకులను సరికొత్తగా వినోదాన్ని అందిస్తూ వస్తోంది. ప్రతీఏటా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సరికొత్త నిర్వచనాన్ని లిఖిస్తూ వస్తోంది. ఈ షోకి మొదటిసారి నాగర్జున హోస్ట్‌గా వ్యవహరించగా.. ఆతర్వాత జూ. ఎన్టీఆర్, అనంతరం నాని హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. Also read: Big Boss 4: బిగ్ బాస్ 4 కోసం నాగార్జున కండీషన్స్ ఇవే

Trending News