Bigg boss Telugu 5: అరే ఏంట్రా ఇది..! షణ్మూకు ముద్దు పెట్టిన సిరి..ఫైర్ అయిన అనీ..!

Bigg boss Telugu 5: బిగ్ బాస్ షోలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లు ఒకరికొకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు సిరి-షణ్మూల మధ్య స్నేహం హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 08:00 PM IST
Bigg boss Telugu 5: అరే ఏంట్రా ఇది..! షణ్మూకు ముద్దు పెట్టిన సిరి..ఫైర్ అయిన అనీ..!

Bigg boss Telugu 5: తెలుగు బిగ్‌బాస్‌ షో రోజురోజూకు ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా కెప్టెన్సీ(Capitancy Task) దక్కించుకునేందుకు కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ, సన్నీ, మానస్‌లు ఎంపికయ్యారు.

ఇందులో భాగంగా.. పోటీదారులకు బిగ్‌బాస్‌ ‘'వెంటాడు వేటాడు' అనే టాస్క్‌ ఇచ్చాడు. థర్మాకోల్‌తో నిండిన గోనె సంచులను కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన బిగ్‌బాస్‌(bigg boss).. బజర్‌ మోగేలోపు ఎవరి సంచిలో ఎక్కువ బాల్స్‌ ఉంటాయో వారే ఈ వారం కెప్టెన్‌ అవుతారని సూచించాడు. ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శ్రీరామ్‌(Sreeram Chandra).. సన్నీ(VJ Sunny), మానస్‌ను ఓడించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. తర్వాత సన్నీ-జెస్సీ మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఎవరు విజయం సాధించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరుకు ఎదురుచూడాల్సిందే.

Also Read: Sekhar Master Daughter Sahithi Dance: సారంగ‌ద‌రియా పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కూతురి డ్యాన్స్ అదుర్స్

మరోవైపు బిగ్‌బాస్‌ హౌస్‌(Bigg Boss Telugu 5)లో షణ్ముఖ్‌-సిరిల మధ్య స్నేహం కొత్త బంధానికి బాటలు పరుస్తోందా అనే అనుమానం తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ‘'మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం' అని షణ్ముఖ్‌(Shanmukh Jaswanth) అంటే, ‘'నీ వల్లే మెంటల్‌గా ఇబ్బంది పడుతున్నా' అని సిరి-షణ్ముఖ్ మాట్లాడుకున్నారు. ‘అయితే 'దూరం పెట్టుకో'’ అని షణ్ముఖ్ సలహా ఇస్తే, సిరి(Siri hanmanth) అతడికి ముద్దు ఇచ్చి వెళ్లిపోయింది. ‘ఏంట్రా ఇది.. అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది'’ అని షణ్ముఖ్ ఆశ్చర్యపోతూ కనిపించాడు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News