Bigg Boss Non Stop Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ నిలిపేసిన డిస్నీ హాట్ స్టార్!

Bigg Boss Non Stop Telugu: అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా డిస్నీ + హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అనేక సాంకేతిక కార్యక్రమాల వల్ల షో ను బుధవారం రాత్రి నుంచి ప్రసారం నిలిపేసినట్లు సమాచారం. గురువారం రాత్రి 12 గంటల నుంచి షో ను పునఃప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 09:13 AM IST
    • బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్
    • కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ ను నిలిపేసిన డిస్నీ + హాట్ స్టార్
    • సాంకేతిక కారణాల వల్ల షో ఆపేసినట్లు సమాచారం
Bigg Boss Non Stop Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ నిలిపేసిన డిస్నీ హాట్ స్టార్!

Bigg Boss Non Stop Telugu: ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమైన 'బిగ్ బాస్ నాన్ స్టాప్' ఓటీటీ షో.. ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయింది. గత 5 సీజన్లుగా టీవీలో గంటన్నర పాటు అలరించిన ఈ షో.. ఫిబ్రవరి 26 నుంచి ఓటీటీలో నాన్ స్టాప్ గా స్ట్రీమింగ్ అవుతుంది. 17 మంది కంటెస్టెంట్లతో.. 84 రోజుల్లో 24 గంటల పాటు అలరించేందుకు సిద్ధమైంది. కొత్త బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన వాళ్లతో ఒక గ్రూప్ గా.. ఇదివరకే బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సెలబ్రిటీలను ఓ గ్రూప్ గా విడదీశారు. 

ఈ రెండు గ్రూపులతో ఆసక్తికర టాస్కులు నిర్వహిస్తున్నారు. డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమాన్ని రోజుకు రెండు ఎపిసోడ్స్ గా విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఏవో సాంకేతిక సమస్యలను ఎదురైనట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ షో ప్రసారాన్ని నిర్వాహకులు ఆపేశారని తెలుస్తోంది. 

బుధవారం రాత్రి నుంచి బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ + హాట్ స్టార్ నిలిపేసింది. అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు గల కారణాలు ఏంటో ఇప్పటికి తెలియరాలేదు. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. 

అయితే బిగ్ బాస్ షో అర్ధాంతరంగా నిలిపేయడానికి కారణమేంటో కూడా నిర్వాహకులు వెల్లడించలేదు. కానీ, గురువారం రాత్రి 12 గంటల నుంచి కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్లు సమాచారం. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న క్రమంలో గంట వ్యవధి తర్వాత ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.  

Also Read: Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!

Also Read: Ghani Movie Release Date: వరుణ్ తేజ్ గని మూవీ విడుదల తేది ఫిక్స్.. ఈసారి పక్కా రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News