Bigg Boss: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన విష్ణు ప్రియ..!.. టైటిల్ గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్..?..

Bigg boss 8 telugu vishnu priya contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి తాజాగా విష్ణు ప్రియ బైటకు వచ్చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణు ప్రియ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వెనుకేసుకుందని వార్తలు జోరుగా వస్తున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 9, 2024, 01:53 PM IST
  • లక్కీ చాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..
  • మరీ అంతగానం రెమ్యునరేషనా..?
Bigg Boss: బంపర్ జాక్ పాట్  కొట్టేసిన విష్ణు ప్రియ..!.. టైటిల్  గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్..?..

Bigg boss 8 season contestant Vishnu Priya remuneration rumours viral: బిగ్ బాస్.. ఈ ప్రొగ్రామ్ ఇప్పటికే అన్ని భాషల్లో ఒక ట్రెండింగ్ కార్యక్రమంలా మారిందని చెప్పుకొవచ్చు.ఈ రియాలీటీ షో ఒక వైపు కాంట్రవర్షీలకు కేరాఫ్ గా మారుతునే.. మరొవైపు అభిమానుల్ని సైతం సొంతం చేసుకుంటుందని చెప్పుకొవచ్చు. తెలుగు లో ప్రస్తుతం బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తొంది.ఈ రియాలీటీ షో.. సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. మొదట ఈ షోలో.. 14 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నట్లు తెలుస్తొంది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీద్వారా మరో 8 మంది కంటెస్టెంట్ లో ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు .

అయితే.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా, ఇద్దరు కంటెస్టెంట్ లు బైటకు వచ్చినట్లు తెలుస్తొంది. వారిలో ఒకరు రోహిణి కాగా, మరోకరు విష్ణు ప్రియ. ఇదిలా ఉండగా.. విష్ణు ప్రియ ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ అయినట్లు తెలుస్తొంది. అయితే.. ఎలిమినెట్ తర్వాత స్టేజీ మీదకు విష్ణు ప్రియ తండ్రి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నాన్నను చూసి ఏమనిపిస్తుందని నాగర్జున అడిగినట్లు తెలుస్తొంది.

దీనికి విష్ణు ప్రియ.. మా నాన్నకు.. ఆడపిల్లలు పుట్టారని కాస్తంత బాధగా ఉండేవారని.. కానీ ఇలాంటి స్టేజీ మీద తాను చేరుకున్నానని... మా నాన్నని ఇక్కడి  వరకు తీసుకుని రావడం తనకు గర్వకారణమని చెప్పినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్ లు ఉన్నట్లు తెలుస్తొంది.  నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్ లు, టాప్ 5లుగా నిలిచారు.

అయితే..  నిఖిల్ కు  బిగ్ బాస్ టైటిల్ గెల్చుకునే చాన్స్ లు పుష్కలంగా ఉన్నాయని.. తాను ఒక ఆడపిల్లగా మాత్రం.. ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నట్లు విష్ణు ప్రియ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విష్ణు ప్రియ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక్ రూమర్స్ వైరల్ గా మారాయి.

Read more: Samantha: చైతూ శోభితల పెళ్లి.. నా కుక్క కంటే ఏ ప్రేమ గొప్పది కాదంటూ సమంత సటైర్‌?

విష్ణు ప్రియ ఏకంగా విన్నర్ కన్న కూడా ఎక్కువగా డబ్బులు వెనకేసుకుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు.. 55 లక్షల వరకు రెమ్యునరేషన్ ఆమెకు అందాయని వార్తలు వైరల్గా మారాయి. దీనిపైన విష్ణు ప్రియ మాత్రం ఇప్పటి వరకు స్పందించినట్లు లేదు.   అయితే.. బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షలు అందజేస్తారు. దీనితో పాటు. ఈసారి.. ప్రత్యేకంగా.. మారుతీ సుజుకీ ఆల్ న్యూ డ్యాజిలింగ్ డిజైర్ సైతం అందజేస్తారని సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News