Bigg Boss 5: బిగ్‌బాస్‌ 5 లో "జబర్దస్త్ వర్ష"...?? వైరల్ అవుతున్న కొత్త జాబితా!

బిగ్‌బాస్‌ 5 లో పాల్గొనే వారి పేర్లు రోజు రోజుకు మారుతూనే ఉన్నాయి, కొత్తగా ఈ లిస్ట్ లోకి జబర్దస్త్ లో అందంతో పాటూ, కామెడీతో అలరిస్తున్న "వర్ష" కూడా పాల్గొంటున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ఇదే కానీ నిజమైతే జబర్దస్త్ కు మరో పెద్ద దెబ్బే అని చెప్పాలి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2021, 05:41 PM IST
  • బిగ్‌బాస్ సీజన్ 5 జబర్దస్త్ వర్ష..??
  • జబర్దస్త్ కు నష్టమే అంటున్న ఆడియన్స్
  • వైరలవుతున్న కొత్త జాబితా
Bigg Boss 5: బిగ్‌బాస్‌ 5 లో "జబర్దస్త్ వర్ష"...?? వైరల్ అవుతున్న కొత్త జాబితా!

Bigg Boss Telugu Season 5: తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి షురూ అయ్యింది.  ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 (Bigg Boss Telugu Season 5) సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందన్నవిషయం అందరికి తెలిసిందే!

బిగ్‌బాస్‌-5 తెలుగు కోసం అందరు ఎదురు చూస్తున్నారు.. దాని కన్నా ముందు బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎవరు వెళ్లబోతున్నారనే దానిపైనే అందరికి ఆసక్తి నెలకొంది. రోజుకు ఒకరి పేరు కలుపుతూ.. నిత్యం అంచనా వేసిన జాబితా మారుతూనే ఉంది.. వీళ్ళు వెళ్తున్నారంట.. వాళ్లు వెళ్తున్నారంట.. అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

Also Read: Shocking News: ఆత్మహత్య చేసుకున్న "కాంచన-3" సినిమా హీరోయిన్

కొత్తగా మరో జబర్దస్త్ షో (Jabardasth Comedy show) నటి బిగ్‌బాస్‌ లో కనపడనుందన్న ప్రచారం వినపడుతుంది.. జబర్దస్త్ తో ఫేమస్ అయిన ముక్కు అవినాష్ (Mukku Avinash), రోహిణి (Rohini) బిగ్‌బాస్‌ షో లో పాల్గొన్నారు. అందంతోనే కాదు కామెడీతో ఆకుట్టుకుంటున్న "జబర్దస్త్ వర్ష" (Jabardasth Varsha) ఇపుడు ఆ షో ను వదిలి, బిగ్‌బాస్‌ 5 (Bigg Boss) లో చేరనుందన్న ముచ్చట్లు వినపడుతున్నాయి. ఇది మాత్రం నిజమే అయితే జబర్దస్త్ కు భారీ నష్టమనే చెప్పాలి. ఇప్పటి వరకి బులెట్ బాస్కర్ (Bullet Bhaskar) మరియు ఇతరేతర టీంలలో చేస్తున్న వర్ష కామెడీ టైమింగ్‌ మంచి పేరు తెచ్చుకుంది. 

Also Read: Prabhas Salaar: ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్...రాజమనార్​గా జగ్గు భాయ్

బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ ల జాబితా ఇప్పటికే చాలాపేర్లు ముందుకొచ్చినా.. ఇప్పుడు తాజాగా మరో జాబితా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్లలో నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, నటుడు సన్నీ, యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో,  టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆట సందీప్, రఘు, కొత్తగా "జబర్దస్త్ వర్ష" పేరు కూడా వినపడుతుంది. ఈ షోను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ చేయబోతున్న విషయం అమన అందరికి తెలిసిందే.

వీటన్నిటికి తెర పడాలంటే షో ప్రారంభమయ్యే వరకి ఎదురుచుదాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News