Bheemla Nayak Collection: రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'!

Bheemla Nayak Collection: గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన 'భీమ్లా నాయక్' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పవన్ కల్యాణ్, రానా నటన, డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తొలి రోజే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా.. ఇప్పుడు మూడో రోజుకు రూ. వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 01:06 PM IST
    • బాక్సాఫీసు వద్ద హవా కొనసాగిస్తున్న పవర్ స్టార్
    • రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 'భీమ్లా నాయక్' మూవీ
Bheemla Nayak Collection: రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'!

Bheemla Nayak Collection: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే (ఫిబ్రవరి 25) థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. పవన్ కల్యాణ్ యాక్షన్, డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ కలెక్షన్లనూ 'భీమ్లా నాయక్' కొల్లగొడుతున్నాడు. 

తొలి రోజు రూ.50 కోట్ల పైచీలుకు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని పలువురు టాలీవుడ్ పీఆర్ఓలు ట్వీట్ చేశారు. సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. యూఎస్​లోనూ మూడు రోజుల్లోనే ఈ సినిమా, రెండు మిలియన్​ డాలర్ల మార్క్​ను అధిగమించింది. ఇప్పుడీ చిత్రం రూ.150 కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. 

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పక్కన నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఎస్ ఎస్ తమన్ స్వరాలను సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.   

Also Read: New Movie Releases: ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్.. ఈ వారం రిలీజయ్యే సినిమాలు!

Also Read: Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్' మూవీపై టాలీవుడ్ ప్రముఖుల ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News