Bhagyashri Borse: శ్రీలీల..కృతి.. బాటలోనే.. మరొక హీరోయిన్ అదే ఫేట్ రిపీట్ అయ్యేనా?

Bhagyashri Borse in Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే ఈమెకు మొదటి సినిమా. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు.. కానీ అప్పుడే ఈమె వరుసగా ఆఫర్లు అందుకుంటూ అభిమానులకి సైతం షాక్ ఇస్తుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 11, 2024, 01:09 PM IST
Bhagyashri Borse: శ్రీలీల..కృతి.. బాటలోనే.. మరొక హీరోయిన్ అదే ఫేట్ రిపీట్ అయ్యేనా?

Bhagyashri Borse Lucky Baskhar: మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ లు అందుకొని.. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు అందుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం.. కనీసం మొదటి సినిమా విడుదల కాకముందే ఆఫర్ల వర్షం కురుస్తూ ఉంటుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే విషయంలో కూడా అదే జరుగుతుంది.

రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో.. ఈమె త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. కానీ అప్పుడే ఈమెపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి.. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది భాగ్యశ్రీ. 

తాజాగా ఇప్పుడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా అందుకుంది ఈ భామ. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ ఆ సినిమా తర్వాత.. సుధాకర్ చెరుకూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని శ్రీలీల, కృతి శెట్టి..వంటి హీరోయిన్లు వరుసగా ఆఫర్లు అందుకున్నారు. కానీ భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ సినిమా విడుదల కాకముందే వరుసగా సినిమాలు సైన్ చేస్తుంది. ఇక్కడ దాకా బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం భాగ్యశ్రీ ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో వచ్చిన ప్రతి సినిమా.. ఆమెకు గొప్పగానే అనిపిస్తుంది. 

ఇలా కథను పట్టించుకోకుండా ఆఫర్ల మీద మాత్రమే దృష్టి పెట్టి వరుసగా సినిమాలు.. సైన్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు. ఉదాహరణకి శ్రీ లీల, కృతి శెట్టి వంటి వారు కూడా.. వరుసగా ఆఫర్లు రావడంతో కథను పట్టించుకోకుండా ఒప్పుకొని వరుస డిజాస్టర్లు అందుకున్నారు. స్టార్ స్టేటస్ అందుకోవాల్సిన సమయంలో.. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్స్ గా పేరు తెచ్చుకున్నారు. 

ప్రస్తుతం భాగ్యశ్రీ కూడా ఇలా వరుస పెట్టి సినిమాలలో సైన్ చేస్తుంది. మరి ఆమె పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుందా లేక మిగతా హీరోయిన్ల విషయంలో జరిగిన దానిని గుర్తుంచుకొని తన విషయంలో అలా జరగకుండా చూసుకుంటుందా అని ఇంకా తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం భాగ్యశ్రీ ఎక్కువ సినిమాలు సైన్ చేసినప్పటికీ అవి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News