Bigg Boss Elimination: ఈ వారం నో ఎలిమినేషన్.. శోభాను కాపాడేందుకేనా?

Bigg Boss 7 Telugu: నేటితో బిగ్ బాస్ పదకొండు వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 02:42 PM IST
Bigg Boss Elimination: ఈ వారం నో ఎలిమినేషన్.. శోభాను కాపాడేందుకేనా?

Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ 11వారం తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. ఇందులో అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ,, ప్రిన్స్ యావర్ ఉన్నారు. హీరో శివాజీ, పల్లవి ప్రశాంత్ మాత్రమే నామినేషన్స్ లో లేరు. 

ఇక ఓటింగ్ విషయానికొస్తే.. 34.11 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ప్రిన్స్ యావర్, 19.74 శాతం ఓట్లతో సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి రెండో స్థానంలో ఉన్నారు. 12.8 శాతం ఓట్లతో రతిక రోజ్ మూడో స్థానంలో, 8.32 శాతంతో నాలుగో స్థానంలో అశ్విని, 6.94 శాతంతో ఐదో స్థానంలో ప్రియాంక, 6.5 శాతం ఓట్లతో అర్జున్ అంబటి ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి ఉన్నారు. 6.33 శాతంతో గౌతమ్ కృష్ణ ఏడో స్థానంలో, 5.27 శాతంతో శోభా శెట్టి 8వ స్థానంలో ఉన్నారు. అయితే గత కొన్ని వారాలుగా శోభాశెట్టిని బదులు మరొకరిని బలి చేస్తూ వచ్చింది బిగ్ బాస్ టీమ్. 

అయితే ఈసారి కూడా ఎలిమినేషన్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రతి ఆదివారం ఓ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తారు. ఈ వారం ఎలిమినేషన్ లేదని సమాచారం. దీనికి కారణం ప్రిన్స్ యావర్ తన ఫ్రీ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడమే. దీని వల్లే ఎలిమినేషన్ రద్దు చేసినట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం. మరోసారి శోభాశెట్టిని కాపాడేందుకు ఇలా చేశారని టాక్ వినిపిస్తోంది. 

Also Read: Trisha Tweet: త్రిషను బెడ్‌రూమ్‌లోకి ఎత్తుకెళదామనుకున్నా.. తమిళ నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News