Puri Jagannadh Open Letter : పూరి భార్యాపిల్లల ఫోటోలు షేర్ చేసిన బండ్ల గణేష్.. ఓపెన్ లెటర్ మీద బండ్లన్న ట్వీట్

Bandla Ganesh Reacts on Puri Jagannadh Open Letterబండ్ల గణేష్‌ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ మీద ఆ మధ్య చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ తన కొడుకు, కూతురు, భార్యను పట్టించుకోలేదన్నట్టు అర్థం వచ్చేట్టుగా చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 01:39 PM IST
  • నెట్టింట్లో పూరి ఓపెన్ లెటర్ వైరల్
  • సక్సెస్, ఫెయిల్యూర్ మీద కామెంట్స్
  • పూరి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన బండ్లన్న
Puri Jagannadh Open Letter : పూరి భార్యాపిల్లల ఫోటోలు షేర్ చేసిన బండ్ల గణేష్.. ఓపెన్ లెటర్ మీద బండ్లన్న ట్వీట్

Bandla Ganesh Reacts on Puri Jagannadh Open Letter : పూరి జగన్నాథ్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తనను బెదిరించి డబ్బులు వసూల్ చేయాలని చూస్తున్నారంటూ, తన పరువు తీస్తే రూపాయి కూడా ఇవ్వను అన్నట్టుగా చెప్పిన పూరి ఆడియో ఒకటి లీక్ అయింది. ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ తన ఫ్యామిలీని మానసికంగా, శారీరకంగా వేధించాలని చూస్తున్నట్టుగా, తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలని చూస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు పూరి జగన్నాథ్

అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ వేధాంత ధోరణిలో మాట్లాడుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. జయాపజయాలు రెండూ వేర్వేరని అనుకుంటాం, కానీ ఈ రెండు ఒకే రకమైనవని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఒక దాని వెంట ఇంకొటి వస్తాయని తెలిపాడు. ఇక ఇందులో చాలా విషయాలే చెప్పుకొచ్చాడు. తాను ఇంత వరకు ఎవ్వరినీ మోసం చేయలేదని, చేసి ఉంటే అది కేవలం టికెట్లు కొని నా సినిమాలు చూసిన ప్రేక్షకులను మోసం చేశానంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.

ఇదే విషయాన్ని బండ్ల గణేష్ కూడా తీసుకుని ట్వీట్ వేశాడు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియెన్స్‌ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నేను వాళ్లకే రుణపడి ఉంటాను. నేను వాళ్లకే జవాబుదారిని. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సెంటెన్స్‌లను బండ్ల గణేష్ ట్వీట్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ట్వీట్ వేస్తూ.. పూరి తన భార్య లావణ్య, కూతురు పవిత్రలతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.

 

అంటే బండ్లన్న ఉద్దేశ్యం ఏంటి?.. పూరి జగన్నాథ్ తన భార్యను మోసం చేయలేదని చెబుతున్నాడా? వారి పర్సనల్ లైఫ్ బాగానే ఉందని చెప్పదల్చుకున్నాడా? అసలు అతని ఉద్దేశ్యం ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రొమాంటిక్ సినిమా ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఎలా మాట్లాడాడో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ తన ఫ్యామిలీని, తన కొడుకుని నిర్లక్ష్యం చేస్తోన్నట్టుగా చెప్పుకొచ్చాడు. దీనిపై పూరి తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. అది వేరే సంగతి. ఇక ఇప్పుడు బండ్లన్న పూరి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి, ఆ ట్వీట్ వేసి అందరిలోనూ అనుమానాలను పుట్టించాడు.

Also Read : Puri Jagannadh open Letter: ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు.. కలకలం రేపుతున్న పూరీ జగన్నాధ్ లేఖ!

Also Read : Pelli Fame Prudhvi : ప్రతీరోజూ పడక సుఖం కావాలంట!.. 56 ఏళ్ల వయసులో 'పెళ్లి' పృథ్వీ కామెంట్స్.. వామ్మో మామూలోడు కాదు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News