Bhagavanth Kesari OTT: భగవంత్ కేసరి ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. ఆలస్యం కానున్న స్ట్రీమింగ్.. కారణం ఇదే..!

Bhagavanth Kesari: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 07:28 PM IST
Bhagavanth Kesari OTT: భగవంత్ కేసరి ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. ఆలస్యం కానున్న స్ట్రీమింగ్.. కారణం ఇదే..!

Bhagavanth Kesari OTT Platform Fix: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ఈరోజు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో ఈ సినిమా తొలి రోజు భారీగానే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి లియో, టైగర్ నాగేశ్వరరావు నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలిచారోతెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరోవైపు భగవంత్  కేసరి డిజిటల్ రైట్స్ నెట్టింట హాట్ టాఫిక్ గా మారాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. భారీ ధరకే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ గవంత్ కేసరి సినిమాను 50 రోజుల తర్వాత విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకుందట అమెజాన్ ప్రైమ్.  దీని బట్టి చూస్తే ఈ మూవీ డిసెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. బాలయ్య మేనకోడలి పాత్రలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల కనిపించనుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మూవీపై భారీ లెవల్లో అంచనాలను పెంచేశాయి. 

Also Read: Jr NTR: చరిత్ర సృష్టించిన జూ.ఎన్టీఆర్.. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్ గా తారక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News