Anushka Shetty Video: వారి కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రత్యేక షో.. ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty: యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి నయా మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పి.మ‌హేష్ బాబు  డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజై విజయవంతంగా నడుస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 11:22 PM IST
Anushka Shetty Video: వారి కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రత్యేక షో.. ఎప్పుడంటే?

Anushka Shetty Video Viral: సీనియర్ నటి అనుష్క శెట్టి, యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). ఈ మూవీకి కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు  దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క మాస్టర్ చెఫ్ పాత్రలో, నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజైంది. తొలి రోజు నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ థియటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు యూఎస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. ఇప్పటికే ఈ చిత్రం అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసింది. 

మూవీ విజయవంతం కావడంతో.. తాజాగా మూవీ టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ఈ గురువారం ప్రత్యేక షో వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి అనుష్క సోషల్ వీడియో వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మూవీని ఆదరిస్తున్నందుకు అందరికి థాంక్యూ చెప్పింది అనుష్క. తెలుగు రాష్ట్రాల్లో సెలెక్ట్ చేసిన థియేటర్స్ లో ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేక షో వేయనున్నట్లు ఆమె వెల్లడించారు.  దీనికి సంబంధించిన థియేటర్స్ లిస్ట్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ సక్సెస్ తో  నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇంతకముందు నవీన్ నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు సినిమాలు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 

Also Read: Vishal: హైకోర్టు క్లియరెన్స్.. ముందుగా అనుకున్న తేదీకే విశాల్ 'మార్క్ అంటోనీ'..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News