Animal closing collections: రణబీర్ కపూర్'యానిమల్' క్లోజింగ్ కలెక్షన్స్.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న వసూళ్లు..

Animal world wide closing collections: గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ అంచనాలతో విడుదలై సంచలన విజయం సాదించింది.సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు.తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 25, 2024, 05:11 PM IST
Animal closing collections: రణబీర్ కపూర్'యానిమల్' క్లోజింగ్ కలెక్షన్స్.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న వసూళ్లు..

Animal world wide closing collections: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి  బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్ (Animal). ఈ మూవీ గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది.అంతేకాదు ఈ మూవీని రణబీర్ మార్క్ యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు. ఇందులో రణబీర్ కపూర్‌ను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. మరోవైపు ఈ సినిమాను 3 గంటలకు పైగా సాగదీయడం కొంచెం ఇబ్బంది పెట్టినా.. ఓవరాల్‌గా మాస్ ప్రేక్షక లోకం ఈ సినిమాకు దాసోహం అంది. ఈ మూవీ రణబీర్ కపూర్ హీరోయిజంతో పాటు బాబీ దేవోల్ విలనిజం.. అనిల్ కపూర్ యాక్టింగ్.. రష్మిక ఎమోషనల్ యాక్టింగ్.. తృప్తి దిమ్రీ హాట్ సీన్స్ వెరసి ఈ సినిమా లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
 
మిక్స్‌డ్ రివ్యూస్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 37.20 కోట్ల షేర్ (రూ. 73.50 కోట్ల గ్రాస్) సొంతం చేసుకుంది. డంకీ, సలార్ మూవీల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఓవరాల్‌గా ఈ మూవీ టోటల్ రన్‌లో రూ. 502 కోట్ల పైగా నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.
యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలుగు రాష్ట్రాలు.. రూ. 73.50 కోట్ల గ్రాస్..
తమిళనాడు.. రూ. 10.40 కోట్ల గ్రాస్..
కర్నాటక.. రూ. 36.75 కోట్ల గ్రాస్..
కేరళ.. రూ. 4.90 కోట్ల గ్రాస్..
రెస్ట్ ఆఫ్ భారత్ -... రూ. 533.80 కోట్లు గ్రాస్..
ఓవర్సీస్.. రూ. 253.70 కోట్ల గ్రాస్..
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 913.05 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది.

ఓవరాల్‌గా అంచనాలకు మించి ఈ మూవీ అన్ని అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.తెలుగులో చూపించి జోరు తమిళం, మలయాళంలో పెద్దగా చూపించలేకపోయింది. లేకపోతే.. ఈజీగా రూ. వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరి ఉండేది. ఏది ఏమైనా 'యానిమల్' మూవీ  బాక్సాఫీస్ దగ్గర సంచలనమే రేపింది.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News