Anasuya Movie Release: అనసూయ సినిమా థ్యాంక్యూ బ్రదర్ ఓటీటీలోనే విడుదల

Anasuya Movie Release: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండంతో మళ్లీ చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని వాయిదా పడుతున్నాయి. అనసూయ నటించిన సినిమా ధియేటర్ రిలీజ్ కాకుండా..ఓటీటీనే ఆశ్రయించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 26, 2021, 05:56 PM IST
Anasuya Movie Release: అనసూయ సినిమా థ్యాంక్యూ బ్రదర్ ఓటీటీలోనే విడుదల

Anasuya Movie Release: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండంతో మళ్లీ చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని వాయిదా పడుతున్నాయి. అనసూయ నటించిన సినిమా ధియేటర్ రిలీజ్ కాకుండా..ఓటీటీనే ఆశ్రయించింది.

కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమకు భారీగా దెబ్బ తగిలింది. దాదాపు ఏడు నెలల పాటు థియేటర్లు తెర్చుకోలేదు. టాలీవుడ్‌లో(Tollywood) మాత్రం ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు బంపర్ హిట్‌గా మారి.. మళ్లీ గాడిన పడుతుందనుకున్నారు. ఈలోగా పరిస్థితులు మరోసారి తలకిందులయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)పేరుతో విజృంభిస్తోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో కరోనా మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్(Lockdown) విధించగా..కొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఈనెలలో విడుదల కావల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. నాగ్‌చైతన్య నటించిన లవ్‌స్టోరీ( Love story), దగ్గుబాటి రాణా నటించిన విరాటపర్వం (Virata parvam) వాయిదా పడ్డాయి. ఇంకొన్ని సినిమాలు మరోసారి ఓటీటీని ( OTT ) ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లితెర యాంకర్ అనసూయ (Anasuya) నటించిన థ్యాంక్ యు బ్రదర్ ( Thank you Brother ) సినిమా ధియేటర్ రిలీజ్‌ను రద్దు చేసుకుంది. ఏప్రిల్ 30 వతేదీన థియేటర్లలో విడుదల కావల్సిన సినిమా...ఇప్పుడు మే 7వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలవుతోంది.

అయితే ఆహాలో (AHA ) విడుదలకు సంబంధించిన డీల్ ఇంతకుమందే జరిగి ఉండవచ్చని కొందరంటున్నారు. ధియేటర్‌లో విడుదలైన వారం రోజులకు ఓటీటీలో విడుదల చేసేందుకు ఒప్పందమై ఉండవచ్చని అంచనా. అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో రమేశ్ దాపర్తి తెరకెక్కించిన ఈ సినిమాలో అనసూయ గర్భిణీగా నటిస్తోంది. 

Also read: Mohan Babu: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న నటుడు మోహన్ బాబు, ప్రజలకు విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News